Share News

Health : కుర్చీలో వ్యాయామం

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:30 AM

ఎక్కువ సమయాల పాటు కంప్యూటర్లకు అతుక్కుని పని చేసే ఉద్యోగాలు మనవి. అలాంటప్పుడు శరీరంలో కొవ్వు పేరుకుపోవడం సహజం.

Health : కుర్చీలో వ్యాయామం

ఫిట్‌నెస్‌

ఎక్కువ సమయాల పాటు కంప్యూటర్లకు అతుక్కుని పని చేసే ఉద్యోగాలు మనవి. అలాంటప్పుడు శరీరంలో కొవ్వు పేరుకుపోవడం సహజం. జిమ్‌కు వెళ్లే సమయం కూడా దొరకని పరిస్థితి. ఇలాంటి వాళ్లు కుర్చీలో కూర్చుని చేసుకునే వ్యాయామాలు కూడా ఉన్నాయి. అవే ఇవి!

  • సిట్టింగ్‌ క్రంచెస్‌: కుర్చీ అంచు మీద నిటారుగా కూర్చుని, చేతులను మడిచి తల వెనక ఉంచుకోవాలి. తర్వాత ఛాతీ మోకాళ్లకు తగిలేలా వంగాలి. ఇలా వంగేటప్పుడు శ్వాస వదులుతూ పైకి లేచేటప్పుడు శ్వాస పీల్చుకోవాలి. ఇలా 15 సార్లు, 3 సెట్లు చేయాలి.

  • బటర్‌ఫ్లై పోజ్‌: బద్ధకోణాసనంతో కూడా పొట్ట కొవ్వును కరిగించవచ్చు. ఈ ప్రయోజనంతో పాటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ వ్యాయామం కోసం, కుర్చీలో నిటారుగా కూర్చుని, మోకాళ్లను మడిచి, నడుము దగ్గరకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు రెండు పాదాలనూ బలంగా ఆనించి ఉంచి, చేతులతో పట్టుకోవాలి. తర్వాత అదే భంగిమలో మోకాళ్లను పైకి, కిందకూ లేపి, దించాలి. ఇలా 15 సార్లు, 3 సెట్స్‌ చేయాలి.

  • సిట్టింగ్‌ స్ట్రెయిట్‌: కుర్చీలో నిటారుగా కూర్చునే అలవాటు అలవరుచుకోవాలి. ఈ అలవాటుతో రోజుకు 350 క్యాలరీలు ఖర్చవుతాయి. కాబట్టి జారిగిలబడి కూర్చోకుండా, వెన్ను కుర్చీకి ఆనుకుని ఉండేలా నిటారుగా కూర్చోవాలి.

  • అంకెలు గీయాలి: కుర్చీలో కూర్చుని, కాలి వేళ్లతో గాల్లో అంకెలు, అక్షరాలు గీయడం సాధన చేయాలి. ఇలా చేయడం వల్ల కాలి పిక్కలు, తొడ కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు ఆరోగ్యంగా మారతాయి. కాళ్లకు వ్యాయామం దొరుకుతుంది.

Updated Date - Oct 01 , 2024 | 12:30 AM