Share News

OTT : ఈ వారమే విడుదల

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:40 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

నెట్‌ఫ్లిక్స్‌లో

జిగ్రా

విదేశీ జైలులో ఉన్న తన తమ్ముడిని రక్షించటానికి ఒక అక్క చేసిన ప్రయత్నమే జిగ్రా! దీనిలో ఆలియాభట్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఽకమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా ఆలియాభట్‌ నటనకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయి.

అమరన్‌

మేజర్‌ మార్కండేయ వరదరాజన్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివకార్తికేయన్‌, సాయి పల్లవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించారు.

చర్చిల్‌ ఎట్‌ వార్‌

రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌ ఎలాంటి పాత్ర పోషించారనే విషయంపై రూపొందించిన డాక్యుమెంటరీ సిరిస్‌ ఇది. చరిత్రపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్‌ ఇది.

fgh.jpg

ప్రైమ్‌ వీడియో

కంగువా

ఒక తెగ నాయకుడు తన ప్రజలను రక్షించుకోవటానికి చేసే ప్రయత్నమే కంగువా! సూర్య హీరోగా భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. బాబీ డియోల్‌, దిషా పఠానీ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

విక్కీ విద్యాకా వో వాలీ వీడియో

రాజ్‌కుమార్‌ రావు, తృప్తి డిమ్రీ నటించిన ఈ చిత్రాన్ని 1990ల నేపథ్యంలో తీసారు. విక్కి, విద్యలకు కొత్త పెళ్లి అవుతుంది. వారు తమ కోసం తీసుకున్న ఒక వ్యక్తిగతమైన వీడియో మాయమవుతుంది. ఆ తర్వాత జరిగే అనేక సరదా సంఘటనల సమాహారమే ఈ సినిమా.

Updated Date - Dec 08 , 2024 | 05:40 AM