Share News

Technology : క్షణాల్లో యాప్‌ పేర్లను దాయొచ్చు!

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:59 AM

ఐఫోన్‌లో యాప్స్‌ పేర్లను దాచిపెట్టవచ్చు. ఐఫోన్‌ కస్టమైజేషన్‌ కోసం ఐఓఎస్‌....

Technology :  క్షణాల్లో యాప్‌ పేర్లను దాయొచ్చు!

ఐఫోన్‌లో యాప్స్‌ పేర్లను దాచిపెట్టవచ్చు. ఐఫోన్‌ కస్టమైజేషన్‌ కోసం ఐఓఎస్‌ 18 సరికొత్త ప్రమాణాన్ని సెట్‌ చేసింది. తద్వారా ఐఫోన్‌ హోమ్‌ స్ర్కీన్‌పై యాప్‌ల పేర్లను దాచి ఉంచొచ్చు. అందుకోసం...

  • ఐఫోన్‌ హోమ్‌ స్ర్కీన్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేయాలి.

  • ఎడిట్‌ని టాప్‌ చేయాలి. కస్టమైజ్‌ను సెలెక్ట్‌ చేసి లార్జ్‌ని ఎంచుకోవాలి.

  • లార్జ్‌ని సెలెక్ట్‌ చేయగానే యాప్‌ నేమ్‌ అదృశ్యమవుతుంది. ఐకాన్‌ సైజ్‌ కూడా కొద్దిగా పెరుగుతుంది.

దీనికితోడు ఐకాన్‌లను డార్క్‌మోడ్‌లోకి మార్చుకోవచ్చు. లేదంటే అన్నింటినీ పింక్‌ కలర్‌లోకి చేంజ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌పై ఈ ఫీచర్‌ ఇప్పటికే ఉంది. అదే ఇప్పుడు ఐఓఎస్‌లోకి వచ్చింది. ఐఫోన్‌ 11, 12 13, 14 ఫోన్లలో చాలా వాటికి ఈ ట్రిక్‌ పనిచేస్తుంది.

Updated Date - Jun 22 , 2024 | 12:59 AM