Burmese dishes : బర్మాలో కూడా మన వంటే!
ABN , Publish Date - Jan 26 , 2024 | 10:52 PM
బర్మాకు మనకు ఉన్న సారూప్యత ఏమిటి? ఆహారం. ఈ సమాధానం విని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ బర్మాలో కూడా మనలాగే వెల్లుల్లి, అల్లం, ఎండుమెరపకాయల వంటివి లేకుండా వంట పూర్తి కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే-
బర్మాకు మనకు ఉన్న సారూప్యత ఏమిటి? ఆహారం. ఈ సమాధానం విని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ బర్మాలో కూడా మనలాగే వెల్లుల్లి, అల్లం, ఎండుమెరపకాయల వంటివి లేకుండా వంట పూర్తి కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే- బర్మాలో శాఖాహారుల సంఖ్య చాలా ఎక్కువ. దోసెలు, సమోసాల వంటివి అక్కడ కూడా మనకు లభ్యమవుతాయి. మన ఆహారానికి ఇంత దగ్గరగా ఉన్న కొన్ని బర్మా వంటలు ఎలా వండుకోవాలో చూద్దాం.
స్పైసీ కుకుంబర్ సలాడ్
కావాల్సిన పదార్థాలు : బర్మా బర్మాస్ చిల్లి గార్లిక్ ఆయిల్- 4 టేబుల్ స్పూన్, బర్మాస్ బర్మాస్ బలచౌంగ్ (క్రంచీ స్పెయిస్ బ్లెండ్)- 2 టేబుల్ స్పూన్, ఇంగ్లీష్ కుకుంబర్స్- 150 గ్రాములు, చక్కెర- 2 టీ స్పూన్లు, రైస్ వెనిగర్- 1.5 టేబుల్ స్పూన్, ఉప్పు- రుచికి తగినంత, నువ్వులు- 2 టీ స్పూన్స్ (వేయించాలి)
తయారీ విధానం : కుకుంబర్స్(కీరాదోసకాయలు) తోలు తీసి మందంగా గుండ్రని ముక్కలు కట్ చేసుకోవాలి. బౌల్‌లో నీళ్లు వేసి ఉప్పు, చక్కెర వేయాలి. ఇందులో దోసకాయల్ని ఐదు నిముషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లను తీసేయాలి. బౌల్‌లోని కుకుంబర్ ముక్కల్లోకి బర్మాస్ చిల్లీ గార్లిక్, నూనె, రైస్ వెనిగర్ వేసిన తర్వాత వేయించిన నువ్వులు వేసి కలపాలి. బాగా కలిపితే కుకుంబర్ ముక్కలకు మిశ్రమం పడుతుంది. ఈ బౌల్‌మీద ప్లేట్ ఉంచి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్‌లోంచి తీసిన తర్వాత బర్మాస్ బలచౌంగ్ కలపాలి. ఈ స్పైసీ చిల్డ్ కుకుంబర్‌ను సైడ్ డిష్‌గా తినాలి.
అంకుల్ మాంగ్ నూడిల్స్
కావాల్సిన పదార్థాలు :
గోధుమ, బియ్యంతో చేసిన నూడిల్స్-200 గ్రాములు, పోక్ చాయ్- 4 టేబుల్ స్పూన్లు, బర్మా బర్మాస్ మౌంగ్ చిల్లీ గార్లిక్ పేస్ట్- 5 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాబేజీ- అర కప్పు, తరిగిన ఫ్రెంచ్ బీన్స్- 4 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యారెట్ ముక్కలు- 3 టేబుల్ స్పూన్లు, సిల్కెన్ తోఫు- 30 గ్రాములు, ఇంపోర్టెడ్ తారో- 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ టమోటా- 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు- 3 టేబుల్ స్పూన్లు, ఆస్పరాగ్స్- 3 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం- 2 టేబుల్ స్పూన్లు, బ్లాక్ పెప్పర్- 2 టీస్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, చక్కెర- రుచికి తగినంత, వెజిటెబుల్ స్టాక్- అరకప్పు
గార్నిష్ కోసం- స్ర్పింగ్ ఆనియన్, ఫ్రైడ్ గార్లిక్
తయారీ విధానం :
నూడిల్స్‌ను ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. కూరగాయలన్నీ మందంగా కట్ చేసుకోవాలి. తోఫును వేలంత పొడవులో కట్ చేసుకుని బ్రౌన్ రంగు వచ్చేంత వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఒక ప్యాన్ తీసుకుని వేడయ్యాక సగం వెజిటెబుల్ స్టాక్ వేసి బర్మా బర్మాస్ మౌంగ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా చింతపండు రసం వేశాక గోధుమ నూడిల్స్ వేసి.. మంటను హైహీట్‌లో ఉంచి కలపాలి. ఈ నూడిల్స్‌ను బౌల్‌లో వేసి చల్లబరచాలి. అదే ప్యాన్‌లో మిగిలిన విజిటెబుల్ స్టాక్‌ను తీసుకుని ఇందులో బర్మా బర్మాస్ చిల్లి పేస్ట్ వేసి కరిగిన తర్వాత మిగిలిన చింతపండు రసం వేసి నిముషం తర్వాత ఉడికిన కూరగాయ ముక్కల్ని వేసి కలిపితే సాస్ వాటికి అంటుకుంటుంది. ఇందులో నూడిల్స్‌తో పాటు మిగిలినవన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులోకి ఫ్రైడ్ గార్లిక్ ముక్కలతో పాటు స్ర్పింగ్ ఆనియన్స్ వేసి కలపాలి.
స్టిర్ ఫ్రై వెజిటెబుల్స్
ఇన్ మలబార్ సాస్
కావాల్సిన పదార్థాలు : నీళ్లు- 2 టేబుల్ స్పూన్లు, నూనె- అర టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు- 2 (నూనెలో వేయించాలి), తరిగిన వెల్లుల్లి ముక్కలు- అర టీస్పూన్, బేబీ కార్న్- 1 కప్పు, క్యారెట్ ముక్కలు- 1 కప్పు, ఆస్పరగస్- 1 కప్పు, బ్రొకోలీ- 1 కప్పు, బాక్ చాయ్- 1 కప్పు, బర్మా బర్మాస్ మలార్ స్టిర్ ఫ్రై సాస్- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం : కూరగాయ ముక్కల్ని శుభ్రం చేసిన తర్వాత మంచి నీళ్లలో రెండు నిముషాల పాటు ఉడకబెట్టాలి. ఆ తర్వాత నీళ్లను పారబోసి.. కూరగాయ ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి. వెంటనే ప్యాన్‌ను హీట్ చేసి మిరపకాయలు, తరిగిన వెల్లుల్లి ముక్కలను వేయాలి. వెల్లుల్లి రంగు మరేంత వరకూ గరిటెతో కదుపుతుండాలి. ఇందులోకి మలార్ సాస్ వేసిన తర్వాత ప్యాన్ అంతా కలిసేట్లు రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను చిలకరించాలి. ఇందులో ఉడకబెట్టిన కూరగాయముక్కల్ని వేశాక.. మలార్ సాస్ వేసి కలపాలి. నిముషం పాటు హైఫ్లేమ్‌లో ఉంచి ప్యాన్‌ను ముందుకు వెనకకు కదపాలి. చివరగా దీన్ని బౌల్‌లో వేసుకుని.. అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.
టాంగీ మలార్ స్పాగెట్టి
కావాల్సిన పదార్థాలు : స్పాగెట్టి- 100 గ్రాములు (ఇటాలియన్ పాస్తా నూడిల్స్ ఇవి. గోధుమలతో తయారు చేస్తారు), తురిమిన చీజ్- 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి- 2 రెబ్బలు (సన్నగా తరగాలి), తరిగిన పుట్టగొడుగుల మిశ్రమం- 50 గ్రాములు, నూనె- 1 టేబుల్ స్పూన్
(గార్నిష్ కోసం- ఆలివ్ ఆయిల్‌తో పాటు ప్రాసెస్డ్ చీజ్
తీసుకోవాలి)
తయారీ విధానం : స్పాగెట్టిని ఉప్పునీళ్లలో ఉడికించాలి. నాలుగు టేబుల్ స్పూన్లు నీళ్లు మిగిలి ఉండగా స్పాగెట్టిని తీసేయాలి. ఆ నీళ్లను పక్కన ఉంచుకోవాలి. ప్యాన్‌లో నూనెను వేడిచేసి తరిగిన వెల్లుల్లి ముక్కలతో పాటు పుట్టగొడుగు ముక్కలను వేసి కలపాలి. హైఫ్లేమ్‌లో ప్యాన్‌ను ముందుకు వెనకకు కదుపుతూ రెండు నిముషాల పాటు కలపాలి. ఇందులోకి బర్మా బర్మాస్ మలార్ స్టిర్ ఫ్రై సాస్ వేసుకోవటంతో పాటు మిగిలిన స్పాగెట్టి నీళ్లను పోయాలి. నిముషం పాటు కుక్ చేశాక స్పాగెట్టిని వేయాలి. మిశ్రమం అంతా స్పాగెట్టికి పట్టిన తర్వాత మంటను కట్టేయాలి. తురిమిన చీజ్‌ను చల్లుకుని తినాలి. అవసరం అనుకుంటే కాస్త ఆలివ్ ఆయిల్‌ను చల్లుకున్నా పర్వాలేదు. రుచికంగా ఉంటుంది ఈ టాంగీ మలార్ స్పాగెట్టి.
వా పొటాటో
కావాల్సిన పదార్థాలు :
నూనె- 50 గ్రాములు, బంగాళదుంపలు- 350 గ్రాములు, వెల్లుల్లి- 2 టీస్పూన్లు, పచ్చి మిరపకాయల పేస్ట్- 3 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్- 2 టేబుల్ స్పూన్లు, కాఫిర్ లైమ్ లీవ్స్- 2, చింతపండు రసం- అరకప్పు, సీజనింగ్ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడినంత, చక్కెర- రుచికి తగినంత, పసుపు- కొద్దిగా, కార్న్‌ఫ్లోర్- కొద్దిగా, స్ర్పింగ్ ఆనియన్- 3 టేబుల్ స్పూన్లు, బర్మా బర్మాస్ బలచౌంగ్- 4 టేబుల్ స్పూన్లు (మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఎండిన రొయ్యలతో చేస్తారు).
తయారీ విధానం :
బంగాళాదుంపలను శుభ్రంగా కడిగిన తర్వాత వేలంత పొడవుతో కట్ చేసుకోవాలి. దీన్ని పసుపు నీళ్లలో వేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత నీళ్లను తీసేసి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ఇందులోకి కొద్దిగా నూనె వేయటంతో పాటు కార్న్‌ఫ్లోర్ చల్లుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో నూనె వేసిన తర్వాత బంగాళాదుంప ముక్కలను బంగారు రంగు వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన నూనెను వేరే బౌల్‌లోకి వంచుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి కాఫిర్ లైమ్ ఆకులు వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. అందులోకి చింతపండు రసం వేసిన తర్వాత సీజనింగ్ పౌడర్ చల్లాలి. ఆ తర్వాత బంగాళాదుంప ముక్కల్ని వేసి, రెడ్ చిల్లీ సాస్ వేసి కలపాలి. తరిగిన స్ర్పింగ్ ఆనియన్స్ వేశాక బర్మా బర్మాస్ బలచౌంగ్ వేసిన తర్వాత బంగాళాదుంపలకు పట్టేట్లు కలపాలి. వా పొటాటో రెడీ. దీన్ని ప్లేట్‌లోకి వేసి స్ర్పింగ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకుని తినాలి.
కర్టెసీ
బర్మాబర్మా
నాలెడ్జ్ సిటీ, హైటెక్‌సిటీ,
హైదరాబాద్