చలి కాలంలో రోగనిరోధకశక్తికి...
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:18 AM
శీతాకాలం వచ్చేసింది. చాలా మందికి అడపా దడపా జ్వరం, జలుబు వస్తూనే ఉంటాయి. దీనికి కారణం రోగనిరోధక శక్తి లేకపోవటం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి ఉన్న ఒక సాధనం జీడిపప్పు, బాదం, ఆక్రూట్, పిస్తా వంటి
శీతాకాలం వచ్చేసింది. చాలా మందికి అడపా దడపా జ్వరం, జలుబు వస్తూనే ఉంటాయి. దీనికి కారణం రోగనిరోధక శక్తి లేకపోవటం. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి ఉన్న ఒక సాధనం జీడిపప్పు, బాదం, ఆక్రూట్, పిస్తా వంటి డ్రై ప్రూట్స్. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ మన శరీరానికి ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే వీటిని నేరుగా తినకుండా నానబెట్టి తినటం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు పౌష్టికాహార నిపుణులు. ఆ వివరాలేమిటో చూద్దాం.
బాదం: ప్రొటీన్, ఫైబర్, విటమిన్-ఈ, మెగ్నిషియం, జింక్, ఐరన్ వంటి అనేక పదార్థాలు బాదంలో ఉంటాయి. అయితే బాదంలో ఫైటెక్ యాసిడ్ ఉంటుంది. ఇది జింక్, ఐరన్ వంటివి మన శరీరంలో చేరకుండా అడ్డుపడుతూ ఉంటుంది. బాదంను తినే ముందు నానబెడితే ఈ యాసిడ్ నిర్వీర్యం అవుతుంది.
జీడిపప్పు: జీడిపప్పులో కూడా అనేక రకాల మినరల్స్, ప్రొటీన్లు ఉంటాయి. తినే ముందు- కొద్ది సేపు జీడిపప్పును నానబెడితే శరీరంలోకి మెగ్నీషియం త్వరగా చేరుతుంది. మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరుపై ఇది ప్రభావం చూపుతుంది.
వాల్‌నట్స్: మెదడు చురుకుగా పనిచేయటానికి ఉపకరిస్తాయి. వాల్‌నట్స్‌లో టానిన్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణప్రక్రియకు అడ్డం పడుతూ ఉంటుంది. అందువల్ల వాల్‌నట్స్‌ను కొద్దిసేపు నానబెడితే ఈ పదార్థం పనితీరులో మార్పు వస్తుంది.
అంజీర్: అంజీర్‌ను పండుగా తినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అంజీర్‌ను ఎండబెట్టినప్పుడు దానిలో ఉండే పీచు పదార్థం గట్టి పడుతుంది. అందువల్ల జీర్ణమవటం కష్టమవుతుంది. ఎండు అంజీర్‌లను కొద్ది సేపు నానబెడితే- దానిలో ఉండే ఫైబర్ మెత్తపడుతుంది. త్వరగా జీర్ణమవుతుంది.
పిస్తాలు: పిస్తాలలో కూడా ఫైటెక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల జీర్ణమవటం కష్టమవుతుంది. వీటిని కొద్ది సేపు నానబెడితే ఫైటెక్ యాసిడ్ నిర్వీర్యం అవుతుంది. అప్పుడు పిస్తాపప్పు సులభంగా జీర్ణమవుతుంది.