health tips; ఇలా ఆరోగ్యం బ్రహ్మాండం
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:53 AM
కొన్ని సులువైన నియమాలను అనుసరిస్తూ నిండైన ఆరోగ్యాన్ని పొందే వీలుంది. అదెలాగంటే...
కొన్ని సులువైన నియమాలను అనుసరిస్తూ నిండైన ఆరోగ్యాన్ని పొందే వీలుంది. అదెలాగంటే...
మూడు పూటలా సుష్టుగా భోంచేయకుండా, తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు తినాలి
ఆకుపచ్చని కూరగాయలు, ముదురు రంగు పళ్లు తినాలి
యవ్వనంగా కనిపించడం కోసం సౌందర్య సాధనాల మీద ఆధారపడకుండా, ఆ ఫలితం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలి
వ్యాయామం కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి. డాన్స్, ఒంటిని శ్రమ పెట్టే ఆటలు కూడా వ్యాయామాలే!
ఆహారంలో తెల్లని పదార్థాలను తగ్గించి, గోధుమలతో తయారైన పాస్తా, బ్రెడ్, బ్రౌన్ రైస్ వాడకం పెంచాలి
ఉదయం అల్పాహారం మానకూడదు. నిద్ర లేచిన రెండు గంటల్లోపే బ్రేక్‌ఫాస్ట్ ముగించాలి. దాన్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు తప్పక ఉండేలా చూసుకోవాలి
బరువులు ఎత్తే వ్యాయామాలతో కండలు పెరుగుతాయి అనేది అపోహ! కాబట్టి ఎముకల సాంద్రత, పటుత్వాలను పెంచే వెయిట్ ట్రైనింగ్ నిస్సంకోచంగా చేయవచ్చు.
ఎంతో అరుదుగా తప్ప జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు
చిన్న దూరాలకు వాహనాలు వాడడం మానేయాలి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు వాడాలి.