మధ్యాహ్నం నిద్ర ఇబ్బంది పెడుతుంటే
ABN , Publish Date - Sep 29 , 2024 | 05:16 AM
మధ్యాహ్నం కునుకు మంచిదే అంటారు. కానీ ఆఫీసులో ఆ కునుకు కెరీర్‌పై ప్రభావాన్ని చూపించవచ్చు. మధ్యాహ్నం నిద్ర చాలామందికి ఎదురయ్యేదే. ఈ పరిస్థితిని బయటపడాలంటే ఇలా చేయాలంటున్నారు నిపుణులు.
మధ్యాహ్నం కునుకు మంచిదే అంటారు. కానీ ఆఫీసులో ఆ కునుకు కెరీర్‌పై ప్రభావాన్ని చూపించవచ్చు. మధ్యాహ్నం నిద్ర చాలామందికి ఎదురయ్యేదే. ఈ పరిస్థితిని బయటపడాలంటే ఇలా చేయాలంటున్నారు నిపుణులు.
లంచ్‌లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా రైస్ తినడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. కార్బోహైడ్రేట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించే రసాయనం అయినటువంటి ట్రిప్టోఫన్‌ను వేగంగా విడుదలయ్యేలా చేస్తుంది.
రాత్రుళ్లు పొద్దుపోయే వరకు టీవీ చూడటం వల్ల దాని ప్రభావం నిద్రపై పడుతుంది. బెడ్‌పైకి చేరిన తరువాత ఫోన్ చూసే అలవాటు కూడా మంచిది కాదు. బ్లూ లైట్ నిద్రను దూరం చేస్తుంది.
రాత్రివేళ త్వరగా పడుకుని, సూర్యోదయం కన్నా ముందే లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరానికి, మనసుకు అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి దోహదపడుతుంది.
శరీరానికి తగినంత ఎనర్జీ అందనప్పుడు కూడా అలసట వస్తుంది. శక్తి కావాలంటే నట్స్, బెర్రీస్, డేట్స్ తీసుకోవాలి. ఇవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. ఇవి అలసటను దూరం చేసి శరీరానికి శక్తిని అందిస్తాయి.
ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. కనీసం నలభై ఐదు నిమిషాలు వేగంగా వాకింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగా, మెడిటేషన్ వంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
మధ్యాహ్నం వేళ మెదడుకు ఉత్సాహానిచ్చే విధంగా ఇష్టమైన వాటిని చూడటం, ఆసక్తి ఉన్న వాటికోసం సెర్చ్ చేయడం లాంటివి చేయాలి.