Share News

Kitchen Hacks: ఇంట్లో చికెన్ వండుతున్నారా? అయితే, ఇవి తెలుసుకోవాల్సిందే..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:23 PM

నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ ఇష్టపడుతుంటారు. చికెన్‌ను ఏ రూపంలోనైనా తినేందుకు ఆసక్తి చూపుతారు. కర్రీ చేసినా.. డీప్ ఫ్రై చేసినా.. ముక్క మిగల్చకుండా లాగించేస్తారు. కొందరు ప్రతి ఆదివారం తమ తమ ఇళ్లలో చికెన్ వండుతారు.

Kitchen Hacks: ఇంట్లో చికెన్ వండుతున్నారా? అయితే, ఇవి తెలుసుకోవాల్సిందే..!
Kitchen Hacks

Kitchen Hacks: నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ ఇష్టపడుతుంటారు. చికెన్‌ను ఏ రూపంలోనైనా తినేందుకు ఆసక్తి చూపుతారు. కర్రీ చేసినా.. డీప్ ఫ్రై చేసినా.. ముక్క మిగల్చకుండా లాగించేస్తారు. కొందరు ప్రతి ఆదివారం తమ తమ ఇళ్లలో చికెన్ వండుతారు. మరికొందరు తమకు నచ్చినప్పుడల్లా తింటారు. అయితే, చికెన్ వండటం ఒక ఆర్ట్. ఆ కళ అందరికీ ఉండదు. నిజంగా మాంసం రుచిని, దాని ప్రయోజనాలను ఆస్వాదించాలనుకుంటే.. సరిగ్గా వండాల్సి ఉంటుంది. ఇంట్లో చికెన్ వండేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. కూర టేస్ట్ అదిరిపోతుంది అంతే..

ఫ్రెష్ చికెన్..

చికెన్ టేస్ట్‌ను ఆస్వాధించాలనుకుంటే.. నిల్వ ఉంచిన చికెన్‌కు బదులుగా.. తాజాగా మంసాన్ని కొనుగోలు చేయండి. తాజా మాంసం తేమగా, జ్యూసీగా ఉంటుంది. దీనిని వండేటప్పుడు మసాలాలను వేస్తే.. అవి చికెన్ ముక్కలకు పర్‌ఫెక్ట్‌గా పడుతుంది. దాంతో డిష్ చాలా రుచికరంగా ఉంటుంది.

మేరినేట్ చేయాలి..

మెరినేట్ చేయకుండా చికెన్ ఎప్పుడూ ఉడికించకూడదు. చికెన్ ముక్కలకు ఉప్పు, మసాసాలు సరిపడా పట్టించి.. కాసేపు అలాగే ఉంచితే చికెన్ ముక్కల టేస్ట్ పెరుగుతుంది. అలాగే చికెన్ ముక్కలు విచ్ఛిన్నం అవకుండా.. పీస్ పీస్‌గా ఉంటాయి. వండిన తరువాత చాలా టేస్టీగా ఉంటుంది.

ముక్కలు సమానంగా ఉండాలి..

కొన్ని ముక్కలు చిన్నగా.. మరికొన్ని ముక్కలు పెద్దగా ఉంటే.. కూర మొత్తం టేస్ట్ పాడైపోతుంది. కొన్నిసార్లు తక్కువగా ఉడకడం, అతిగా ఉడకడం జరుగుతుంది. అందుకే.. చికెన్‌ను ఎప్పుడూ సమానంగా కట్ చేయాలి. తద్వార వంట పర్‌ఫెక్ట్‌గా అవుతుంది. కూరలో వేసే మసాలాలు కూడా ముక్కలకు సమభాగంలో సెట్ అవుతాయి.

మూత పెట్టాలి..

చికెన్‌ను వండేటప్పుడు.. ఆ వంట పాత్రను కవర్ చేయాలి. వంట పాత్రపై మూత పెట్టడం వలన ఆవిరి లాక్ అవుతుంది. తేమ కారణంగా చికెన్ ముక్కలు సరిగ్గా ఉడుకుతాయి. చికెన్ మాడిపోకుండా ఉంచుతుంది.

చికెన్ పీస్‌ను కొట్టడం..

కొంత మంది చికెన్‌ను చిన్న చిన్న పీస్‌ల మాదిరిగా కాకుండా.. చారలు చారల మాదిరిగా కట్ చేస్తారు. ఆ పీస్‌లు మెత్తగా అయ్యేలా చేస్తారు. ఇలా చేయడం వలన మాంసం త్వరగా ఉడకడంతో పాటు.. పూర్తిగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది.

Updated Date - Jan 08 , 2024 | 04:51 PM