Share News

Precautions: చలి కాలంలో చర్మం పదిలంగా...

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:24 AM

చలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య చర్మం పొడిబారడం. చలిగాలుల వల్ల చర్మం తేమను కోల్పోయి పగిలిపోతుంది.

Precautions: చలి కాలంలో చర్మం పదిలంగా...

బ్యూటీ

లికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య చర్మం పొడిబారడం. చలిగాలుల వల్ల చర్మం తేమను కోల్పోయి పగిలిపోతుంది. కోల్డ్‌ క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లు రాసినప్పటికీ ప్రయోజనం ఉండదు. అలా కాకుండా చర్మ సంరక్షణ కోసం శీతాకాలంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం!

  • సాధారణంగా చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతాం. దీని వల్ల శరీరానికి కావాల్సిన తేమ అందదు. పైగా చలిగాలులు చర్మం మీదున్న తేమను పీల్చుకొని నిస్తేజంగా మారుస్తాయి. రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని త్రాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

  • చలికాలంలో అందరూ వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల కూడా చర్మం పొడిబారుతుంది. అలా కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

  • శీతాకాలంలో ముఖం శుభ్రం చేసుకోవడానికి స్ట్రాంగ్‌ క్లెన్సర్స్‌ను, బాగా నురగ వచ్చేవాటిని ఉపయోగించకూడదు. ఇవి చర్మంపై సహజసిద్దమైన నూనె ఉత్పత్తి కాకుండా చేస్తాయి. ఎస్‌ఎల్‌ఎస్‌, ఆల్కహాల్‌ లేని తేలికపాటి క్లెన్సర్స్‌ను మాత్రమే వాడాలి. సబ్బు వాడకాన్ని తగ్గించాలి.

  • చర్మం పొడిబారినపుడు ముందుగా టోనర్‌ ఆ తరవాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. టోనర్‌ రాయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ అంది మాయిశ్చరైజర్‌ ఎక్కువసేపు నిలిచేలా చేస్తుంది. కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్‌ నూనెలు సహజ మాయిశ్చరైజర్లు.

  • ముఖానికి హైఅలూరోనిక్‌ యాసిడ్‌ లేదా పెప్టైడ్‌ సీరమ్‌ అప్లయ్‌ చేసినా మంచి ఫలితముంటుంది. బయటికి వెళ్లేటపుడు సన్‌ స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. ఇది చర్మం తేమగా మృదువుగా ఉండేలా చేస్తుంది.

Updated Date - Nov 02 , 2024 | 12:24 AM