Makeup : చలిలో చమక్కుమనేలా...
ABN , Publish Date - Nov 23 , 2024 | 06:18 AM
చలికాలం మేకప్ పట్ల చికాకు పెరుగుతుంది. మేకప్ వల్ల చల్లని వాతావరణంలో చర్మం మరింత పొడిబారిపోయినట్టు అని పించడమే ఇందుకు కారణం. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
చలికాలం మేకప్ పట్ల చికాకు పెరుగుతుంది. మేకప్ వల్ల చల్లని వాతావరణంలో చర్మం మరింత పొడిబారిపోయినట్టు అని పించడమే ఇందుకు కారణం. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
తేమ తగ్గకుండా
మేకప్ ఉత్పత్తుల వల్ల చర్మంలో తేమ తగ్గిపోకుండా ఉండడం కోసం, ఉపయోగించే సీరమ్, మాయిశ్చరైజర్, ప్రైమర్‌లలు కూడా తేమతో కూడినవై ఉండేలా చూసుకోవాలి. మేక్‌పకు ముందు ముఖం కడుక్కున్న వెంటనే తడి పూర్తిగా ఆరేలోగానే వీటిని పూసుకోవాలి.
ద్రవరూప ఉత్పత్తులు
పౌడర్ ఆధారిత ఉత్పత్తులకు బదులుగా ద్రవరూపంలో ఉండే ఫౌండేషన్, బ్లష్‌లు వాడుకోవాలి. ఇవి చర్మానికి చక్కగా అంటుకుపోయి చర్మం తేమను హరించకుండా ఉంటాయి.
పెదవులు
చలికాలం పెదవులు పొడిబారిపోయి, పగిలిపోకుండా ఉండడం కోసం లిప్ స్క్రబ్‌తో వారానికోసారి పెదవులను రుద్దుకుని మృతకణాలను తొలగించుకోవాలి.
తేమను అందించే ప్రత్యేకమైన లిప్‌స్టిక్స్‌నే ఈ కాలంలో వాడుకోవాలి.
బ్లష్
చెక్కిళ్లకు ఎరుపు దనాన్ని తెచ్చిపెట్టే బ్లష్‌లను ఎంచుకునేటప్పుడు క్రీమ్ ఆధారిత బ్లష్‌నే ఎంచుకోవాలి.
సెట్టింగ్ స్ర్పే
పూర్తయిన మేకప్ ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండడం కోసం సెట్టింగ్ స్ర్పే వాడుకుంటూ ఉంటాం. అయితే ప్రత్యేకించి చలికాలం కోసం వాటర్‌ప్రూఫ్ సెట్టింగ్ స్ర్పేను ఎంచుకోవాలి.