Share News

Homework : హోమ్‌వర్క్‌ ఇష్టంగా...

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:53 AM

పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్‌ తామే పూర్తి చేసి హమ్మయ్య... అ

Homework : హోమ్‌వర్క్‌ ఇష్టంగా...

పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్‌ తామే పూర్తి చేసి హమ్మయ్య... అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా తమంతట తాము పిల్లలే ఇష్టంగా హోమ్‌వర్క్‌ చేసుకుపోయేలా చేయగల చిట్కాలున్నాయి. అవేంటంటే...

  • రోజూ స్కూలు నుంచి ఇంటికి రాగానే హోమ్‌వర్క్‌ చేయమని బలవంత పెట్టకుండా గంటపాటు పిల్లలని ఆటలాడనివ్వాలి.

  • ఆటల తార్వత సాన్నం చేయించి, హోమ్‌వర్క్‌ చేయమని పురమాయిస్తే కొత్త ఉత్సాహంతో ఇష్టంగా చేస్తారు.

  • కొందరు పిల్లలకి ఇంట్లో చదవటం, రాయటం నచ్చదు. ఇంట్లో ఉన్నంతసేపు తమకిష్టమైనట్టు ఉండాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి పిల్లలకు హోమ్‌వర్క్‌ చేయమని చెబితే విసుగ్గా చూస్తారు. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? ఏం రాయించారు? ఆ టీచర్‌ ఏం చెప్పింది? అని మాటల్లో పెట్టి పుస్తకాలు తీయించాలి.

  • అవసరమైతే దగ్గరుండి అనుమానాలను నివృత్తి చేయాలి.

  • ఒకసారి సహాయం చేసినా, రెండోసారి వాళ్లంతట వాళ్లే హోమ్‌వర్క్‌ పూర్తి చేసేలా చూడాలి.

  • ప్రతి రోజూ హోమ్‌వర్క్‌కు ఓ సమయాన్ని, స్థలాన్ని కేటాయించి దాన్నే ప్రతిరోజూ అనుసరించేలా చేయాలి.

  • ఎప్పుడైనా పిల్లలు హోమ్‌వర్క్‌ చేయటానికి నిరాకరిస్తే కారణం అడిగి తెలుసుకుని అందుకు తగ్గట్టు స్పందించాలి.

  • హోమ్‌వర్క్‌ చేయటం కూడా ఆటల్లో భాగంగా పిల్లలు ఇష్టంగా చేసే వాతావరణాన్ని కల్పించాలి.

Updated Date - Jun 26 , 2024 | 04:53 AM