Littles : కష్టార్జితం విలువ
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:36 AM
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు.అతను విద్యావంతుడే అయినా, ఏపనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. అతని ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసి అతను తన తండ్రి వద్దకువెళ్లి తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు.
Littles : వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు.అతను విద్యావంతుడే అయినా, ఏపనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. అతని ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసి అతను తన తండ్రి వద్దకువెళ్లి తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు. దానికి అతని తండ్రి నువ్వు పదివేల రూపాయలు తీసుకువచ్చి, నాకు ఇస్తే, నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు. ఓ.. అదెంత పని? అనుకున్న శ్రీధర్ ఆ రోజే ధనవంతుడైన తన మితత్రుని దగ్గరకు వెళ్లి పదివేల రూపాయలు తీసుకొచ్చి, తండ్రి చేతికి ఇచ్చాడు. అయితే, ఆయన ఆ డబ్బును తీసుకుని, ఇది పనికిరాదు అంటూ నీళ్లలోకి విసిరేశాడు.
తండ్రి చేసిన పనికి బాధ పడిన శ్రీధర్ ఆ మర్నాడు తన తల్లిని అడిగి,మరో పదివేల రూపాయలు తెచ్చి, తండ్రి చేతికి ఇచ్చాడు. ఆయన అంతకు ముందు లాగే ఈ డబ్బు కూడా పనికిరాదు అంటూ ఆ డబ్బును పీళ్లలోకి విసిరేసాడు. ఆ తరువాత మరో పదిహేను రోజులకు మరలా పదివేల రూపాయలు తెచ్చి, తండ్రి చేతిలో పెట్టాడు. యధా ప్రకారం తండ్రి ఆ డబ్బును పారవేయబోతుంటే, వెంటనే తండ్రి చేయి పట్టుకుని ఆపి ఇలా అన్నాడు. ‘ ఆగండి నాన్నా.. పారవేయకండి, ఇది నేను రెండు వారాలు కష్టపడి పనిచేస్తే వచ్చిన డబ్బు అన్నాడు.
ఆ మాటలు విన్న ఆయన ‘చూసావా ఇంతకు ముందు నేను డబ్బు పారవేసిన రెండు సార్లు నీకు ఇంత బాధ అనిపించలేదు కారణం ఆ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాకపోవడమే. ఇపుడు డబ్బు పారవేయబోతుంటే నన్ను ఆపావు ఇది కష్టార్జితం కాబట్టి. ఈ విషయం నీకు తెలియాలనే నిన్ను పరీక్షించాను. ఇపుడు నాకు నమ్మకం కుదిరింది.నువ్వు నీ కుటుటంబాన్ని పోషించుకోగలవు.ఇక నీకు పెళ్లి చేస్తాను’ అని చెప్పి, నెల తిరిగేలోగా శ్రీధర్ కు ఘనంగా వివాహం జరిపించాడు.