Share News

Makeup Intact : మేకప్‌ చెక్కుచెదరకుండా..

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:25 AM

కష్టపడి వేసుకున్న మేకప్‌ చిటికెలో చెదిరిపోతే, శ్రమంతా వృథా అవుతుంది. అలా కాకుండా ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి

Makeup Intact : మేకప్‌ చెక్కుచెదరకుండా..

మేకప్‌

కష్టపడి వేసుకున్న మేకప్‌ చిటికెలో చెదిరిపోతే, శ్రమంతా వృథా అవుతుంది. అలా కాకుండా ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండాలంటే, ఈ చిట్కాలు పాటించాలి.

  • సెట్టింగ్‌ పౌడర్‌ ఇలా...

మేకప్‌ పూర్తయిన తర్వాత, దాన్ని సెట్‌ చేసుకోవడం అవసరం. అందుకోసం మేకప్‌ సెట్టింగ్‌ స్ర్పేలు, పౌడర్లు ఉన్నాయి. మేక్‌పలో తడి, పొడి ఉత్పత్తులను కలిపితే, అవి రెండూ జత కట్టి, ఎక్కువకాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. మేక్‌పలో లిక్విడ్‌ ఫౌండేషన్‌, కన్‌సీలర్‌... ఈ రెండూ తడి ఉత్పత్తులు.

సెట్టింగ్‌ పౌడర్‌ పౌడర్‌ రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించేటప్పుడు, ఎలాంటి భయం లేకుండా తడి ఉత్పత్తులను వాడుకోవచ్చు. ముఖం మీద జిడ్డుగా మారే వీలున్న ప్రదేశాలైన నుదురు, చుబుకం, ముక్కు మీద సెట్టింగ్‌ పౌడర్‌ అప్లై చేసుకోవాలి. నిజానికి మేకప్‌ వేసుకున్న ప్రదేశమంతా సెట్టింగ్‌ పౌడర్‌ అప్లై చేసుకోవచ్చు. కానీ చమట, చర్మపు నూనెలతో మేకప్‌ తేలికగా చెదిరిపోయే వీలున్న ప్రాంతాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి.

  • సెట్టింగ్‌ స్ర్పే ఇలా...

ఫౌండేషన్‌, కన్‌సీలర్‌, బ్లష్‌ ముఖానికి అప్లై చేసుకున్న ఉత్పత్తులన్నీ చెక్కుచెదరకుండా ఉండడం కోసం సెట్టింగ్‌ స్ర్పేను వాడుకోవచ్చు. చక్కని బేస్‌ మేక్‌పలో భాగంగా ప్రైమర్‌కు బదులుగా సెట్టింగ్‌ స్ర్పే ముఖం మీద స్ర్పే చేసుకోవచ్చు. అందుకోసం ముఖానికి మొదట మాయిశ్చరైజర్‌ అద్దుకుని, సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకుని, ముఖానికి 6 అంగుళాల దూరం నుంచి సెట్టింగ్‌ స్ర్పేను స్ర్పే చేసుకోవాలి.

ఐ షాడో అద్దుకున్న కొద్ది సేపటికే ముడతలు తలెత్తుతుంటే, ఐ షాడో వేసుకున్న తర్వాత సెట్టింగ్‌ స్ర్పేను వాడుకోకుండా, ఐషాడోలో సెట్టింగ్‌ స్ర్పే కలుపుకుని, అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం బ్లష్‌తో ఐషాడోను తీసుకుని, దాని మీద నాలుగైదు సార్లు సెట్టింగ్‌ స్ర్పేను స్ర్పే చేసి, కనురెప్పల మీద అప్లై చేసుకోవాలి. తడి స్పాంజ్‌ మీద సెట్టింగ్‌ స్ర్పేను స్ర్పే చేసి, హైలైటర్‌లో అద్ది, బుగ్గలు, కనుబొమల పైన, ముక్కు మీద అద్దుకుంటే మేకప్‌ మెరుపు రెట్టింపవుతుంది.

Updated Date - Sep 21 , 2024 | 12:25 AM