మెగా కోడలా.. మజాకా..
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:27 AM
లావణ్య త్రిపాఠి, వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏనాడో ప్రేమలో పడ్డ ఈ జంట.. వారి ప్రేమ వ్యవహారం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
లావణ్య త్రిపాఠి, వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏనాడో ప్రేమలో పడ్డ ఈ జంట.. వారి ప్రేమ వ్యవహారం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియా కెమెరాలకు వీరిద్దరూ చిక్కకపోవడం నిజంగా గ్రేట్. ఏదిఏమైనా పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లాడేశారు. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో ఆసక్తికరంగా తన పెళ్లి ముచ్చట్లను చెప్పుకొచ్చారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ సందర్భంలో ‘ఇంతకీ ఆడపడుచు కట్నం ఎంతిచ్చారేంటి?’ అని యాంకరమ్మ ఆడిగిన ప్రశ్నకు లావణ్య సమాధనమిస్తూ.. ‘తనకు నేనేం ఇవ్వలేదు. తను మా ఇంటి పిల్ల. కావాలంటే తనకు ఏమైనా ఇస్తాను. ఈ మధ్య నిహారిక సొంతగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందికదా.. మంచి కథ ఉంటే తన బ్యానర్‌లో పైసా తీసుకోకుండా నటిస్తాను కూడా’ అంటూ చెప్పుకొచ్చారు లావణ్య త్రిపాఠి. లావణ్య సమాధానం విన్న మెగాఫ్యాన్స్.. ‘మెగా కోడలా మజాకా..‘ అంటూ కితాబులిచ్చేస్తున్నారట.