నిమ్స్‌లో ఎంహెచ్‌ఎం
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:37 AM
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)- ‘మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోగ్రామ్ వ్యవధి రెండున్నరేళ్లు. ఇందులో ఆర్నెల్ల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ కూడా...
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)- ‘మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రోగ్రామ్ వ్యవధి రెండున్నరేళ్లు. ఇందులో ఆర్నెల్ల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ కూడా ఉంది. ఇది ఫుల్ టైమ్ ప్రోగ్రామ్. ఇందులో మొత్తం 20 సీట్లు ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ‘నిమ్‌సెట్-ఎంహెచ్‌ఎం 2024’లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు సమయంలో ఇతర డిగ్రీ/డిప్లొమా ప్రవేశాలకు, ప్రైవేట్ ప్రాక్టీ్‌స/కన్సల్టేషన్‌లకు అనుమతించరు. ప్రోగ్రామ్‌ను గరిష్ఠంగా ఎనిమిదేళ్లలో పూర్తి చేయాలి.
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్/నాన్ మెడికల్ విభాగాల్లో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దివ్యాంగులకు అయిదేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది.
నిమ్‌సెట్-ఎంహెచ్‌ఎం వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. హెల్త్ సైన్సె్‌్‌సకు సంబంధించి 40, అడ్మినిస్ట్రేషన్ అంశాలనుంచి 10, కంప్యూటర్ సైన్సెస్ అంశాల నుంచి 10, జనరల్ నాలెడ్జ్ నుంచి 15, టెస్టింగ్ ఆఫ్ ఐక్యూకు సంబంధించి 15, ఇంగ్లీష్ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్, బీసీ అభ్యర్థులకు కనీసం 40 శాతం; ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు రావాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 16
వెబ్‌సైట్: nims.edu.in