Share News

Ayurveda : పాదాలకు మర్దన మంచిదే!

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:03 AM

నిద్రకు ముందు నూనెతో పాదాలకు మర్దన చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది.

Ayurveda : పాదాలకు మర్దన మంచిదే!

నిద్రకు ముందు నూనెతో పాదాలకు మర్దన చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే వీలుంది. అవేంటంటే... నూనెతో పాదాలకు మర్దన చేయడాన్ని ఆయుర్వేదంలో ‘పాద అభ్యంగనం’ అంటారు. ఇలా పాదాలను మర్దించడం వల్ల శక్తి ప్రవాహం ఊపందుకుని, శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు సంతులనమవుతాయి. పాద అభ్యంగనంతో ప్రయోజనాలు ఇవే...

పాద మర్దన కోసం నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనెలను వాడుకోవచ్చు

శరీర శక్తిని సంతులనం చేసే ప్రదేశాలు ప్రేరేపితమవుతాయి. ఫలితంగా శరీరం సేద తీరుతుంది

ఒత్తిడి, కంటి నిండా నిద్ర పడుతుంది

నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది. రక్త ప్రసరణ మెరుగై వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది

పగుళ్లు వదిలిపోయి, పాదాలు కోమలంగా మారతాయి

రోజంతా శరీర బరువును మోస్తూ అలసిన పాదాల్లోని కండరాలు సేద తీరతాయి

బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి

నువ్వులు, లేదా కొబ్బరి నూనెలతో మర్దన చేయడం వల్ల కీళ్లనొప్పి తగ్గుతుంది.

Updated Date - Nov 26 , 2024 | 04:03 AM