21న ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్
ABN , Publish Date - May 18 , 2024 | 12:00 AM
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రొ మన దేశంలోకి ఈ నెల 21న వస్తోంది. గేమింగ్ ఔత్సాహికులకు ఇన్‌స్టోర్ ఇందులోని ప్రత్యేకత.
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రొ మన దేశంలోకి ఈ నెల 21న వస్తోంది. గేమింగ్ ఔత్సాహికులకు ఇన్‌స్టోర్ ఇందులోని ప్రత్యేకత. మిడ్ రేంజ్ సెగ్మంట్‌కు చెందిన ఈ ఫోన్ దీనికి ముందు వచ్చిన దాని మాదిరిగానే ఉండనుంది. 6.7 ఇంచీల అమోల్డ్ డిస్‌ప్లే, 10-బిట్ ఎఫ్‌హెచ్‌డీ, ఐ కేర్, 144హెచ్‌జెడ్ స్ర్కీన్ రిఫ్రష్ రేట్ ఉండనున్నాయి.
ఇండియాలో విడుదల చేస్తున్న ఈ ఫోన్ ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 4ఎన్‌ఎం ఆక్టా-కోర్ ప్రాసెసర్ పవర్ కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 యూఎఫ్‌ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్ విషయంలో మెరుగైన అనుభవం కోసం పిక్సెల్ వర్క్‌తో ఇంటిగ్రేట్ అయింది. ఎక్స్5 టర్బో చిప్ కారణంగా రెండు ప్రయోజనాలు ఉంటాయి. 90ఎఫ్‌పీఎస్ హై ఫ్రేమ్ రేటు ఉంటుంది.
దాంతో స్టాండర్డ్ డెఫినిషన్ వీడియోని హైడెఫినిషన్ రేంజ్‌కు మార్చగలుగుతుంది. అలాగే ఆడియో ఎక్స్‌పీరియెన్స్ కోసం జేబీఎల్‌తో భాగస్వామ్యాన్ని ఇన్ఫినిక్స్ కుదుర్చుకుంది.
స్మార్ట్ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఈ ఫోన్‌కు వీసీ చాంబర్ కూలింగ్ టెక్నాలజీ సపోర్టు ఉంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీకి తోడు 45 వాట్స్ మేర సేఫ్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
రెండేళ్ళ వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్ అలాగే మూడేళ్ళ వరకు సెక్యూరిటీ పేచస్ ఈ ఫోన్‌కు అందుతాయి. దీని రేటు పాతిక వేల రూపాయల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.