Share News

Tea : ఈ టీలతో ఆరోగ్య రక్ష

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:57 AM

హెర్బల్‌ టీతో మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరడంతో పాటు కొన్ని రుగ్మతలు కూడా అదుపులోకొస్తాయి. కాబట్టి రుగ్మతకు తగిన టీని ఎంచుకుని, తరచూ తాగుతూ ఉండాలి.

Tea : ఈ టీలతో ఆరోగ్య రక్ష

హెర్బల్‌ టీతో మనసుకు, శరీరానికి సాంత్వన చేకూరడంతో పాటు కొన్ని రుగ్మతలు కూడా అదుపులోకొస్తాయి. కాబట్టి రుగ్మతకు తగిన టీని ఎంచుకుని, తరచూ తాగుతూ ఉండాలి.

బ్లాక్‌ టీ

  • మధుమేహంతో పాటు హృద్రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

  • రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయి.

  • వాపులు తగ్గిస్తుంది.

గ్రీన్‌ టీ

  • దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.

  • చెడు కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తుంది.

  • కణాలు ఆరోగ్యంగా పెరగటానికి దోహదపడుతుంది.

  • సాంత్వన చేకూరుస్తుంది.

పెప్పర్‌మింట్‌

  • కఫం బయటికొచ్చేలా చేస్తుంది.

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపులు తగ్గించేదిగా) పని చేస్తుంది.

  • ఆకలిని తగ్గిస్తుంది.

శొంఠి టీ

  • అలర్జీలను తగ్గిస్తుంది.

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పని చేస్తుంది.

  • ప్రయాణాల్లో తలెత్తే మోషన్‌ సిక్‌నెస్‌ను నివారిస్తుంది.

  • రుచిని పెంచుతుంది.

దాల్చిన చెక్క టీ

  • కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

  • వైరస్‌లతో పోరాడుతుంది.

  • ఆర్థ్రయిటిస్‌ లక్షణాలను పారదోలుతుంది.

Updated Date - Jun 26 , 2024 | 04:57 AM