Punctuality : టైం మేనేజ్‌మెంట్‌తో సక్సెస్
ABN , Publish Date - Oct 02 , 2024 | 05:02 AM
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వేగంగా లక్ష్యాలను చేరుకోవలన్నా, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా టైం మేనేజ్‌మెంట్ ఉండాల్సిందే. టైం మేనేజ్‌మెంట్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా...
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వేగంగా లక్ష్యాలను చేరుకోవలన్నా, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా టైం మేనేజ్‌మెంట్ ఉండాల్సిందే. టైం మేనేజ్‌మెంట్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా...
టైమ్ మేనేజ్‌మెంట్ లక్ష్యాలను త్వరగా చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు, నాయకులకు... టైమ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వర్క్, పర్సనల్ లైప్ బ్యాలెన్స్ చేసుకోవడంతో సంతోషాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. సమయ నిర్వహణ ఒత్తిడిని తగ్గిస్తుంది. లక్ష్యాలను సులువుగా, వేగంగా చేరుకునేందుకు సహాయపడుతుంది. మంచి టైమ్ మేనేజ్‌మెంట్‌తో పెద్ద పెద్ద అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. చెమటోడ్చకుండా, స్మార్ట్‌గా పనిచేసేందుకు టైమ్ మేనేజ్‌మెంట్ సహాయపడుతుంది. షెడ్యూల్‌లోపల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవచ్చు. సమయ నిర్వహణ వల్ల టైమ్, ఎనర్జీ మీ కంట్రోల్‌లో ఉంటాయి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.
ఒత్తిడి దూరం
సమయ నిర్వహణ వల్ల ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డెడ్‌లైన్ లోపల పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా అలసిపోయిన ఫీల్ రాకుండా ఉంటుంది. టైమ్‌ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఏ టైమ్‌కి ఏ పనిచేయాలో పక్కాగా ఉంటారు. దీనివల్ల రాత్రుళ్లు మంచి నిద్ర పోతారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది. ఫలితంగా రిలేషన్‌షి్‌ప్స బాగుంటాయి. పనిపై ఫోకస్ పెరగడం వల్ల పెద్ద పెద్ద అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రాజెక్టులపై మరింత సమయం వెచ్చించే అవకాశం దక్కుతుంది.
ప్లానింగ్ ఉంటే...
ప్రతిరోజూ చేయాల్సిన ముఖ్యమైన పనులను పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో రాసుకోవాలి. దీనివల్ల ముఖ్యమైన పనులను ఏ రోజున, ఏ సమయంలోగా పూర్తి చేయాలనే విషయంపై అవగాహన వస్తుంది. పనికి అనుగుణంగా ప్రణాళిక తయారుచేసుకోవాలి. సమయానికి తగినట్టుగా మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని ముఖ్యమైన పనుల కోసం వినియోగించుకోవాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి. ఉదయం లేవగానే ఆ రోజు చేయాల్సిన పనులను ఒకసారి చెక్ చేసుకుని, అందులో ముఖ్యమైన పని ఏమిటో గుర్తించి దాన్ని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. సమయం సరిపోదని తెలిసినపుడు గడువులోగా పని పూర్తి చేస్తామని ప్రామిస్ చేయకూడదు. సమయాభావం వల్ల పని పూర్తి చేయలేకపోయినప్పుడు మీపై దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
వృథా కానివ్వద్దు
సమయం తక్కువగా ఉన్నప్పుడు, పనిని తప్పకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కొలీగ్స్ సహాయం తీసుకోవాలి. పనిని షేర్ చే సుకోవడం మూలంగా త్వరగా పూర్తి చేయవచ్చు. ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం వల్ల సమయం వృథా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆఫీస్ పని వేళల్లో వాటి వాడకం తగ్గించుకోవాలి. ఏ పనిలోనైనా ఆటంకాలు ఉంటాయి. వాటిని సకాలంలో ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది.