ముద్దొచ్చే షార్ట్ గౌన్స్
ABN , Publish Date - May 01 , 2024 | 01:11 AM
కాటన్, షిఫాన్, జార్జెట్.. ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్‌తో తయారయ్యే షార్ట్ డ్రస్‌లను సందర్భాన్ని బట్టి ఎంచుకుంటూ ఉండాలి.
సందర్భాన్ని బట్టి...
కాటన్, షిఫాన్, జార్జెట్.. ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్‌తో తయారయ్యే షార్ట్ డ్రస్‌లను సందర్భాన్ని బట్టి ఎంచుకుంటూ ఉండాలి. పార్టీ వేర్‌గా ధరించాలనుకుంటే జార్జెట్, శాటిన్‌తో తయారైన షార్ట్ డ్రస్ ఎంచుకోవాలి.
డైలీవేర్ కోసం ప్యూర్ కాటన్, కలంకారీ, గాబు ప్రింటెడ్ డ్రస్‌లు బాగుంటాయి. కనిపించాలనుకునే లుక్‌ను బట్టి ఈ డ్రస్‌లను సొంతగా డిజైన్ చేయించుకోవచ్చు. స్లీవ్‌లెస్, బోట్‌నెక్ షార్ట్ డ్రస్‌లు డైరీ వేర్‌గా, నడుముకు బెల్ట్, ఛాతీ దగ్గర వర్క్ ఉన్న డ్రస్‌లను ఈవినింగ్ వేర్‌గా వేసుకోవచ్చు.
యాక్సెసరీస్
శాండిల్స్, హైహీల్స్, బూట్స్... ఎలాంటివైనా షార్ట్ డ్రస్‌కు సూటవుతాయి. రెట్టింపు స్టైలి్‌షగా కనిపించాలనుకుంటే హైహీల్స్, బూట్స్ వేసుకోవచ్చు. వెడ్జెస్, స్పోర్ట్స్ షూతో కూడా ఈ డ్రస్‌ను మ్యాచ్ చేయవచ్చు.
క్యాజువల్‌గా కనిపించాలనుకుంటే లోఫర్స్ వేసుకోవచ్చు. కలర్‌ఫుల్‌గా కనిపించే ఫ్లాట్స్ కూడా ఈ డ్రస్‌కు మ్యాచ్ అవుతాయి.
జ్యువెలరీ
పొడవాటి స్ట్రాప్ ఉండే హ్యాండ్ బ్యాగ్, టోట్స్ ఈ రకం డ్రస్‌లకు మ్యాచ్ అవుతాయి. మెడలో ఎలాంటి జ్యువెలరీ ధరించకుండా ఉంటేనే ఈ డ్రస్‌లో ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు. పొడవాటి హ్యాంగింగ్స్, చేతికి బ్రేస్‌లెట్ బాగుంటాయి. డార్క్ కలర్ లిప్‌స్టిక్స్, షాడోలతో మ్యాచ్ చేస్తే, షార్ట్ డ్రస్‌లో అట్రాక్టివ్‌గా కనిపించవచ్చు.