Share News

గొంతు నొప్పికి ఉపశమనం...

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:23 AM

ఆహారం వల్ల కావొచ్చు.. వాతావరణం మారినపుడు కావొచ్చు.. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వాటిలో గొంతు నొప్పి ఒకటి. మంటతో పాటు తిన్న ఆహారం మింగలేకపోవటం లాంటి సమస్యలుంటాయి...

గొంతు నొప్పికి ఉపశమనం...

ఆహారం వల్ల కావొచ్చు.. వాతావరణం మారినపుడు కావొచ్చు.. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. వాటిలో గొంతు నొప్పి ఒకటి. మంటతో పాటు తిన్న ఆహారం మింగలేకపోవటం లాంటి సమస్యలుంటాయి. ఈ గొంతు నొప్పినుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

  • గొంతు నొప్పి ఉన్నప్పుడు చల్లని నీరు తాగకూడదు. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. వెనిగర్‌ను పుక్కిలించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లంలో బ్యాక్టీరియాను పోగొట్టే లక్షణాలుంటాయి. అందుకే చిన్న ముక్క వేసి నీళ్లు కాచుకోవాలి. ఆ నీటిని తాగాలి లేదా అల్లం టీ తాగవచ్చు.

  • నీళ్లలో తులసి ఆకులు వేసి మరిగించాలి. చల్లార్చిన తర్వాత తాగాలి. లేకుంటే రెండు స్పూన్ల తులసిరసంలో స్పూన్‌ తేనె కలిపి తాగాలి. గొంతు నొప్పి తగ్గిపోతుంది.

  • నీటిలో టీస్పూన్‌ అల్లం రసం వేసి అందులోకి తేనే కలిపి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

  • గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసి తాగటం వల్ల కూడా చక్కని ఫలితం ఉంటుంది.

  • మూడు కప్పులు నీళ్లలో కొద్దిగా వాము వేసి మరిగించాలి. గోరు వెచ్చని వాము నీళ్లను తాగాలి.

  • తమలపాకు రసంలో కొద్దిగా తేనె వేసి కలిపి తాగాలి. సూప్‌లు తాగితే ఉపశమనం ఉంటుంది. కారం, మసాలా, ఐస్‌క్రీమ్స్‌ జోలికి పోకూడదు. మరీ ఇబ్బందిగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jun 20 , 2024 | 12:24 AM