Share News

మోడల్‌ స్కూల్స్‌లో...

ABN , Publish Date - Dec 23 , 2024 | 06:03 AM

తెలంగాణలోని 194 మోడల్‌ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. 2025 జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుంది...

మోడల్‌ స్కూల్స్‌లో...

అడ్మిషన్స్‌

తెలంగాణలోని 194 మోడల్‌ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. 2025 జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆరో తరగతిలోని అన్ని సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఏడు నుంచి పదో తరగతి వరకు మాత్రం ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ వారు మాత్రం రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి వివరాల కోసం https://telanganams.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.


గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఉద్దేశించిన నోటిఫికేషన్‌ వెలువడింది. 2025 ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆన్‌లైన్‌లో రూ.100/- చెల్లించి దరఖాస్తు 2025 ఫిబ్రవరి 1 తేదీలోపు దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు. పాత జిల్లా ఒక యూనిట్‌గా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాస్పెక్టస్‌ కోసం

https://tgswreis. telangana.gov.in/, https://tgtwreis.telangana.gov.in/, http://tgcet.cgg.gov.in/ Ððþ»Œý-òÜO-sŒýË$ ^èþ*yö^èþ$a. Ìôý§‘ TGSWREIS 040&23391598, TGTWREIS 9491063511, MJPTBCREIS -040&23328266, TGREIS 040-&24734899 నెంబర్లను సంప్రదించవచ్చు.

Updated Date - Dec 23 , 2024 | 06:04 AM