Destiny : విధి బలీయం
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:43 AM
గజ భుజంగ విహంగమ బంధనం శశి దివాకరయో ర్గ్రహపీడనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధి రహో బలవానితి మే మతిః... విధికి ఎంతటివారైనా తలవంచవలసిందేనని తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో భర్తృహరి వివరించాడు. ఆ శ్లోకాన్ని...
గజ భుజంగ విహంగమ బంధనం
శశి దివాకరయో ర్గ్రహపీడనం
మతిమతాంచ విలోక్య దరిద్రతాం
విధి రహో బలవానితి మే మతిః... విధికి ఎంతటివారైనా తలవంచవలసిందేనని తన నీతి శతకంలోని ఈ శ్లోకంలో భర్తృహరి వివరించాడు. ఆ శ్లోకాన్ని...
ఫణులు గజములు బక్షులు బట్టువడుట
రవిసుధాకరులకునైన రాహుబాధ
బుద్ధిమంతుల లేమియు బొసగ జూచి
విధి బలాఢ్యుడటంచు భావింతు మదిని...
అంటూ తెలుగువారికి అందించాడు ఏనుగు లక్ష్మణకవి.
భావం: పట్టుకోవడం దాదాపు అసాధ్యమైన పాములు, ఏనుగులు, పక్షులు కూడా బందీలు అవుతూ ఉంటాయి. తమ కాంతితో లోకాలన్నిటినీ ప్రకాశింపజేసే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి రాహువు పట్టి పీడిస్తూ ఉంటాడు. ఎంతో తెలివైనవారు, మంచి బుద్ధి కలిగినవారు సంపదకు నోచుకోకుండా దరిద్రంతో జీవిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు విధి చాలా బలీయమైనదని, దాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని అనిపిస్తూ ఉంటుంది.