Share News

మాత్రలు ఏ మేరకు?

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:11 AM

ప్రమాదాల దెబ్బలు, రుగ్మతలు, కాలిన గాయాలు, సర్జరీల నుంచి త్వరితంగా కోలుకోవడం కోసం బి విటమిన్లు అవసరమే!

మాత్రలు ఏ మేరకు?

పోషకలోపాన్ని భర్తీ చేసే అనుబంధ మాత్రల పట్ల సర్వత్రా కొన్ని అపోహలుంటాయి. వాటి గురించిన వాస్తవాలను తెలుసుకుందాం!

అపోహ: బి విటమిన్‌ సప్లిమెంట్‌ శరీరం మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.

వాస్తవం: ప్రమాదాల దెబ్బలు, రుగ్మతలు, కాలిన గాయాలు, సర్జరీల నుంచి త్వరితంగా కోలుకోవడం కోసం బి విటమిన్లు అవసరమే! అయితే బి కాంప్లెక్స్‌ మాత్రలతో సరిపడా బి విటమిన్లను పొందే వీలుండదు. కాబట్టి పోషకాహారంతో పాటు అదనంగా వీటిని తీసుకోవాలి. అంతే తప్ప పూర్తిగా వీటి మీదే ఆధారపడకూడదు.

అపోహ: సరిగా తినకపోయినా ఫర్వాలేదు. ఒక మల్టీ విటమిన్‌ మాత్ర వేసుకుంటే సరిపోతుంది.

వాస్తవం: ఎంతటి విటమిన్‌ సప్లిమెంట్‌ అయినా ఆహారం లోని పోషకా లన్నింటినీ భర్తీ చేయలేదు. ప్రకృతిసిద్ధ పోషకాలు లోపించిన ఆహారం తింటూ, మాత్రలను వాడుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.

అపోహ: విటమిన్‌ సప్లిమెంట్లతో అదనపు శక్తి సమకూరుతుంది

వాస్తవం: శరీరానికి క్యాలరీల ద్వారా శక్తి సమకూరుతుంది. విటమిన్‌ సప్లిమెంట్లలో క్యాలరీలు ఉండవు. అయితే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి ఈ మాత్రలు సహాయపడతాయి. ఆహారం తీసుకోకుండా ఈ మాత్రలను తీసుకోవడం... ఇంధనం లేకుండా వాహనాన్ని నడిపించే ప్రయత్నం చేయడంతో సమానం. కాబట్టి వీటిని భోజనంతో పాటు తీసుకోవాలి.

Updated Date - Nov 19 , 2024 | 01:11 AM