Horoscope: నేడు ఈ రాశుల వారికి అన్ని శుభ పరిణామాలే..
ABN , Publish Date - Mar 02 , 2024 | 07:13 AM
2-3-2024 (శనివారం) మేష రాశి వారికి నేడు వైద్యం, ఔషధాలు, స్టీల్, రిపేర్ల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వైద్యం, ఔషధాలు, స్టీల్, రిపేర్ల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
జనసంబధాలు విస్తరిస్తాయి. సమావేశాలు, ప్రదర్శనల్లో పాల్గొంటారు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి నిధులు సర్దుబాటవుతాయి. వేడుకల్లో పాల్గొంటారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, కన్సల్టెన్సీలు, అడ్వర్టయిజ్మెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి శుభవార్త అందుకుంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహరుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆోగ్యంపై దృష్టి సారిస్తారు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. చర్చలు, సమావేశాలు, ప్రయాణాలు ఫలిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. మెడికల్ క్లెయములు మంజూరవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడాతాయి. ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న ప్రియతముల రాక ఆనందం కలిగిస్తుంది. గృహారంభ ప్రవేశాలకు అనుకూలం. రాజకీయ, సినీ రంగాల వారు లక్ష్యాలు సాఽధిస్తారు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. కీలకమైన పదవులు అందుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్షాయలు సాధిస్తారు. బందుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ