Share News

Nutrient Reservoirs : పండ్లలో మాంసకృత్తులు

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:01 AM

శాకాహారులకు మాంసకృత్తుల కొరత కొంత ఎక్కువే! అయితే ఆ లోటును భర్తీ చేసే పండ్లు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

Nutrient Reservoirs : పండ్లలో మాంసకృత్తులు

శాకాహారులకు మాంసకృత్తుల కొరత కొంత ఎక్కువే! అయితే ఆ లోటును భర్తీ చేసే పండ్లు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

జామ: కప్పు జామ ముక్కల్లో 4.2 గ్రాముల మాంసకృత్తులుంటాయి. జామలో విటమిన్‌ సి, పీచు కూడా ఎక్కువే కాబట్టి, జామ పండు క్రమం తప్పకుండా తింటూ ఉండాలి.

అవకాడొ: కప్పు అవకాడొ ముక్కల్లో 3 గ్రాముల మాంసకృత్తులుంటాయి. గుండె, మెదడుకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా దీన్లో ఉంటాయి.

బ్లాక్‌బెర్రీ: కప్పు బెర్రీల్లో 2 గ్రాముల మాంసకృత్తులుంటాయి. అదనంగా యాంటీఆక్సిడెంట్లు, పీచు విటమిన్లు కలిగి ఉండే బ్లాక్‌బెర్రీ తరచూ తింటూ ఉండాలి.

అప్రికాట్‌: ఒక పండులో 0.5 గ్రాముల మాంసకృత్తులుంటాయి. పావు కప్పు ఎండు అప్రికాట్స్‌లో ఎక్కువ మోతాదులో 2 గ్రాముల మాంసకృత్తులుంటాయి.

కివి: కప్పు కివి ముక్కల్లో 2 గ్రాముల మాంసకృత్తులుంటాయి. విటమిన్‌ సితో పాటు సహజసిద్ధ ఎంజైమ్స్‌ను కూడా కలిగి ఉండే కివి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.

అరటిపండు: ఒక అరటిపండులో 1.3 గ్రాముల మాంసకృత్తులుంటాయి. పొటాషియం సమృద్ధిగా కలిగి ఉండే అరటిపండు తక్షణ శక్తినిస్తుంది.

పనస: కప్పు పనస తొనల్లో 3 గ్రాముల మాంసకృత్తులుంటాయి.

Updated Date - Nov 26 , 2024 | 04:01 AM