బరువు తగ్గించే ఆహారం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:45 AM
వీటిలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు, కొవ్వులు కూడా తక్కువే! కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు బ్లాక్ కరెంట్స్‌ను తరచూ తింటూ ఉండాలి.
బరువు తగ్గడం కోసం తినే ఆహార పరిమాణాన్ని తగ్గించడంతో పాటు, బరువు తగ్గించే పదార్థాలను కూడా అదనంగా తీసుకోవాలి. అవేంటంటే...
బ్లాక్ కరెంట్స్: వీటిలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు, కొవ్వులు కూడా తక్కువే! కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు బ్లాక్ కరెంట్స్‌ను తరచూ తింటూ ఉండాలి.
అంజీర్: ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా చక్కెర తక్కువగా ఉండే అంజీర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పైగా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి మధుమేహులు సైతం ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.
ప్రూన్స్: వీటిలో పొటాషియం, ఫైబర్ ఎక్కువ. దీన్లో ఉండే షుగర్ ఆల్కహాల్ అయిన సార్బిటాల్ మలబద్ధకాన్ని వదిలిస్తుంది. వీటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే మధుమేహలు వీటిని నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.
ఎండు ద్రాక్ష: వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి రక్తంలో చక్కెరలు వెంటనే పెరగవు. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువ కాబట్టి పరిమితంగా తినాలి.
అప్రికాట్స్: వీటిలో పీచు, విటమిన్ ఎ ఎక్కువ. వీటిలో ఖర్జూరాల కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని తింటూ ఉండాలి.