Share News

Nutritional deficiency : సిలీనియం తగ్గితే?

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:08 AM

థైరాయిడ్‌ హార్మోన్‌ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించే సిలీనియం అనే మూలకం, వేర్వేరు శరీర జీవక్రియల పనితీరుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది.

Nutritional deficiency : సిలీనియం తగ్గితే?

థైరాయిడ్‌ హార్మోన్‌ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించే సిలీనియం అనే మూలకం, వేర్వేరు శరీర జీవక్రియల పనితీరుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పోషకం లోపంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అదెలాగో తెలుసుకుందాం!

సిలీనియం కలిగి ఉండే యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు, ఆక్సిడేటివ్‌ ఒత్తిడి నుంచి గుండెకు రక్షణనిచ్చి, మెరుగైన పనితీరుకు దోహదపడతాయి. ఈ మూలకం లోపంతో థైరాయిడ్‌ గ్రంథి, కండరాలు, గుండె దెబ్బతింటాయి. ప్రత్యేకించి ఈ మూలకం లోపంతో గుండె, కేషన్‌ వ్యాధి బారిన పడుతుంది. చైనాలోని కేషన్‌ అనే ప్రాంతం నుంచి ఈ వ్యాధికి ఈ పేరొచ్చింది. అక్కడి నేలల్లో సిలీనియం మోతాదు తక్కువగా ఉండడంతో, ఆ ప్రాంతంలోని ప్రజలు ‘కార్డియొమయోపతి’ని పోలిన గుండె జబ్బు బారిన పడుతూ ఉండడంతో ఈ వ్యాధికి ఆ ప్రాంతం పేరును పెట్టడం జరిగింది. గుండె పెరగడం, గుండె కండరాలు బలహీనపడడం, గండె పనితీరులో హెచ్చుతగ్గులు తలెత్తి అంతిమంగా గుండె విఫలమైపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. ఈ లోపాన్ని అరికట్టడం కోసం పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, బీన్స్‌, బఠాణీ, పుట్ట గొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఓట్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.

Updated Date - Nov 19 , 2024 | 01:08 AM