Share News

Heart Attack: చలికి పెరిగే గుండెపోటు ముప్పు

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:15 AM

మిగతా కాలాలతో పోలిస్తే, చలి కాలంలో గుండె పోటు ముప్పు 53% పెరుగుతుంది. కుంచించుకుపోయిన రక్తనాళాలతో శరీరానికి వెచ్చదనాన్ని సమకూర్చే క్రమంలో శరీరం ఒత్తిడికి లోనవుతుంది.

Heart Attack: చలికి పెరిగే గుండెపోటు ముప్పు

మిగతా కాలాలతో పోలిస్తే, చలి కాలంలో గుండె పోటు ముప్పు 53% పెరుగుతుంది. కుంచించుకుపోయిన రక్తనాళాలతో శరీరానికి వెచ్చదనాన్ని సమకూర్చే క్రమంలో శరీరం ఒత్తిడికి లోనవుతుంది. అంతే కాకుండా ఈ కాలంలో శారీకక శ్రమ కొరవడడం, క్యాలరీలు ఎక్కువ కలిగి ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాలు కూడా గుండె పోటు ముప్పును అదనంగా తోడవుతాయి. కాబట్టి ఈ కాలంలో గుండె జబ్బు రోగులు, గుండెను సురక్షితంగా ఉంచుకోవడం కోసం విపరీతమైన చలి నుంచి రక్షణ పొందుతూ, శరీరాన్ని చురుగ్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. గుండె మీద ఒత్తిడిని నివారించడం కోసం శరీరం వెచ్చబడే, చల్లబడే ప్రక్రియల్లో ఒక క్రమాన్ని పాటించాలి. ఒకేసారి చల్లని వాతావరణంలో నుంచి వేడి వాతావరణంలోకి, లేదా వేడి వాతావరణంలో నుంచి చల్లని వాతావరణంలోకీ వెళ్లకూడదు. అలాగే ఈ కాలంలో దొరికే ఆకుకూరలు, పుల్లని పండ్లు, ఒమేగా3 ఫ్యాట్స్‌ కలిగి ఉండే వాల్‌నట్స్‌, అవిసె గింజలు తీసుకోవాలి. నూనెలో వేయించిన అల్పాహారాలు, తీయని పానీయాలు మానేయాలి. రక్తపోటును పరీక్షించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో మెలుగుతూ ఉండాలి. ఛాతీ నొప్పి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, విపరీతంగా చమట పట్టడం, అలసట మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

Updated Date - Dec 31 , 2024 | 04:15 AM