NRI: విశాఖకు అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణను కోరుతున్న ఏపీ ప్రజలు
ABN , Publish Date - Aug 01 , 2024 | 03:24 PM
విశాఖపట్టణానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరణకు ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. కె. రాంమోహన్ నాయుడు కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో విశాఖపట్టణం విమానాన్ని పునరుద్ధించే డిమాండ్ ఊపందుకొంది.
మళ్ళి చిగురిస్తున్న ఆశలు – చూపులన్నీ రాంమోహన్ నాయుడు వైపు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విశాఖపట్టణానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరణకు ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, పరిసర ప్రాంతాలకు చెందిన ప్రవాసీయులు (NRI) భారీ సంఖ్యలో విదేశాలలో పని చేస్తుండగా ప్రస్తుతం వీరందరు హైదరాబాద్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు.
దుబాయి నుండి హైదరాబాద్ మీదుగా విశాఖపట్టణానికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసు గతంలో కొంత కాలం కొనసాగినా 2021లో కరోన సంక్షోభ సందర్భంగా దీన్ని రద్దు చేసారు. ఈ విమానం కేవలం ఒక్క దుబాయి నుండి మాత్రమే ప్రయాణికులను తీసుకెళ్ళవల్సి రావడంతో ఆశించిన మెర రద్దీ లేకపోవడంతో రద్దయింది. దీని కంటే తక్కువ రద్దీ కల్గిన సెక్టార్లలో కూడా విమానాలను ఎయిర్ ఇండియా నడుపుతున్నా విశాఖ రూటులో మాత్రం రద్దు చేయడం జరిగింది.
NRI: ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆగస్టు 4న న్యూజెర్సీలో సమావేశం!
ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన కె. రాంమోహన్ నాయుడు కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో విశాఖపట్టణం విమానాన్ని పునరుద్ధించే డిమాండ్ ఊపందుకొంది. విదేశాలలో ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారిలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల వారు అధికమని, కాబట్టి విశాఖ విమాన సర్వీసు తమ హక్కు అని యూఏఈలోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు, విశాఖ నివాసి అయిన యలమర్తి శరత్ అన్నారు.
న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విశాఖ విమాన పునరుద్ధరణ కోసం వినతి పత్రాన్ని ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ గల్ఫ్ దేశాల ఎయిర్‌లైన్సులు విశాఖకు విమానం నడపడానికి సిద్ధంగా ఉన్నాయని కానీ అదే ఎయిర్ ఇండియా మాత్రం వెనుకంజ వేస్తుండడం ఆశ్చర్యకరమని శరత్ పేర్కొన్నారు.
ఇతర ఎయిర్ లైన్సులు కాకుండా మాతృదేశానికి చెందిన ఎయిర్ ఇండియా లేదా ఇండిగో ఎయిర్ లైన్సుల ద్వారా మాత్రమే ప్రయాణించడానికి ప్రవాసాంధ్రులు మరింత ముందుకు వస్తున్నారని కూడా శరత్ వెల్లడించారు.
అంధ్రప్రదేశ్ పునర్విభజన సహాయంలో భాగంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా కూడా విశాఖ విమాన సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
మంత్రి రాంమొహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లుగా కూడా ప్రవాసీ ప్రముఖుడు వెల్లడించారు.
Read Latest NRI News and Telugu News