NRI: ఈ నెల 19న వాషింగ్టన్ డీసీలో అట్లతద్ది వేడుకలు
ABN , Publish Date - Oct 08 , 2024 | 01:01 PM
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన అట్లతద్ది పండుగను వాషింగ్టన్ డీసీలో ఈనెల 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రవాసాంధ్రులు తెలిపారు.
* లోగోను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
* ఏపీ రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామ
ఎన్నారై డెస్క్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన అట్లతద్ది పండుగను వాషింగ్టన్ డీసీలో ఈనెల 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రవాసాంధ్రులు (NRI) తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముగ్గులు, ఆటల పోటీలు, భరతనాట్యం, కూచిపూడి తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
NRI: తానా, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ విజయవంతం!
ఈ వేడుకకు సంబంధించిన లోగోను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అక్కడ ఆవిష్కరించారు. తెలుగువారికి ప్రత్యేకమైన అట్లతద్ది లాంటి పండుగలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతిని కాపాడటానికి ప్రవాసాంధులు విశేష కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలుగు భాష, కళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. వారి పిల్లలకూ నేర్పించడం అభినందనీయమన్నారు.
NRI: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలోనూ అట్లతద్దిని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ పూర్వ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు ఆయనను కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో చర్చించి అట్లతద్దిని అధికారికంగా నిర్వహించేలా కృషిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు మహిళలకు అట్లతద్ది ఎంతో ఇష్టమైన పండుగని సాయిసుధ పాలడుగు అన్నారు.
కార్యక్రమంలో సుధ కొండపు, అనిత మన్నవ, నవ్య ఆలపాటి, నీలిమా చనుమోలు, సరిత బొల్లినేని, ఇందు చలసాని, శిరీష నర్రా, సుష్మ అమృతలూరి, మల్లి నన్నపనేని, వల్లి కుర్రే, సరిత ముల్పూరి తదితరులు పాల్గొన్నారు.