Share News

NRI: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN , Publish Date - Oct 08 , 2024 | 06:57 AM

దుబాయ్‌లో జీడబ్ల్యూసీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

NRI: దుబాయిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అంటూ బతుకమ్మ పాటలతో ఎడారి నగరం దుబాయిలోని తెలంగాణ మహిళలు సంప్రదాయక వస్త్రాధరణలో వచ్చి కలిసి ఉల్లాసంగా గడిపారు. నిరంతర యాంత్రిక జీవన విధానంతో అలిసిపోయిన మహిళలు వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సరదాగా ఆటపాటలలో మునిగిపోయారు (NRI).

శనివారం సాయంత్రం యూఏఈలోని ప్రప్రథమ తెలంగాణ ప్రవాసీ సంఘమైన జి.డబ్ల్యు.సి.ఎ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఉత్సహాంగా పాల్గొన్న మహిళలు ఒక్కక్కరు ఒక్కో బతుకమ్మ పాడి అందర్నీ ఆకట్టుకోన్నారు. ఒక్క యూఏఈలోనే కాకుండా మొత్తం గల్ఫ్ దేశాలలో ప్రప్రథమమైన తెలంగాణ ప్రవాసీ సంఘం జి.డబ్ల్యూ.సి.ఎ రెండు దశాబ్దాల క్రితం అరబ్బు దేశాలలో మొట్టమొదటగా బతుకమ్మ వేడుకలకు దుబాయిలో శ్రీకారం చుట్టగా ఇప్పటికీ అది కొనసాగడమే కాకుండా ప్రతి ఏటా ఇతరులు అనేకులు కూడా దీన్ని నిర్వహిస్తున్నారు.

3.jpg

TANA: తానా వైద్యశిబిరం విజయవంతం.. 550 మందికి చికిత్స


కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళా శక్తి, గౌరవానికి బతుకమ్మ ప్రతీక అని అన్నారు. గల్ఫ్ అరబ్బు దేశాలలో కూడా బతుకమ్మ సంప్రదాయాన్ని తెలంగాణ మహిళలు వైభవంగా నిర్వహించడం ముదావహమని అన్నారు. ఇంటా బయటా ఎక్కడా కూడా తెలంగాణ సంప్రదాయం ఎప్పటికీ కొనసాగించడం తెలంగాణ ప్రజల ప్రత్యేకత అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మను దుబాయిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించడం పట్ల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ అభినందించారు. రేలా రేలా గోదావరి తన బతుకమ్మ పాటలతో మహిళలను ఉత్సహాపరిచారు.

4.jpgNRI: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు


భారీ సంఖ్యలో తెలంగాణ ఆడపడుచులను బతుకమ్మలను చూస్తే తనకు స్వంత స్థలం వరంగల్‌లో బతుకమ్మ ఆడుతున్న అనుభూతి కల్గిందని దుబాయిలో ఉపాధ్యాయురాలిగా పని చేసే వరంగల్ నగరానికి చెందిన మంజు వాణి చెప్పారు. ఎమిరేట్స్ లోని తెలంగాణ మహిళలందరూ ఆతృతతో ఎదురు చూసే సందర్భం బతుకమ్మ అని షార్జాలో అత్యంత ప్రమాదరకమైన రోగులకు ఆరోగ్య సేవలను పరిశీలించే క్రిటికల్ కేర్ విభాగానికి అధిపతిగా పని చేసే సిద్దిపేట జిల్లాకు చెందిన భారతీ రెడ్డి వ్యాఖ్యానించారు. దుబాయిలో ఆధునిక జీవనంలోనూ పసుపు ముద్దతో గౌరమ్మను తయారుచేసి కుంకుమ భరణితో బొట్టు పెట్టి అగరవత్తులు, అలాగే నైవేద్యం సమర్పించడాని మహిళలు ప్రాధాన్యత ఇస్తున్నారంటే అది సంస్కృతిపై వారికున్న గౌరవమని సౌమ్య పేర్కొన్నారు. గత నాలుగేళ్ళుగా దుబాయిలోని బతుకమ్మ వేడుకలో గణనీయ మార్పులు వస్తున్నట్లుగా బ్యాంకరయిన హైదరాబాద్ నగరానికి చెందిన స్వప్న అన్నారు.

5.jpgNRI: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే చంద్రబాబు ధ్యేయం: ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు


దుబాయిలో తాను మొదటిసారిగా బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నట్లుగా ప్రముఖ ఎయిర్‌లైన్సులో ఎయిర్‌హోస్టెస్‌‌గా పని చేసే హైదరాబాద్ నగరానికి చెందిన జ్యోతిర్మయి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

దుబాయిలోని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నల్ల నర్సయ్య నేతృత్వంలోని దళిత కళాకారుల బృందం చేసిన డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొన్ని అనివార్య కారణాల వలన సభా వేదికను చివరి క్షణంలో మార్చినా కూడా మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం చివర్లో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో తాము ఆశించిన రీతిలో బతుకమ్మలు పాడలేకపోయామని కొందరు మహిళలు చెప్పారు.

సంప్రదాయకంగా కేవలం పూర్తిగా మహిళలతో మాత్రమే బతుకమ్మను నిర్వహించడానికి తాము ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో కేవలం కుటుంబాలు, మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని జి.డబ్ల్యూ.సి.ఎ ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాస రావు, సలాఓద్దీన్, సామ్యుల్‌లు వెల్లడించారు.

6.jpg7.jpg8.jpg1.jpgRead Latest and NRI News

Updated Date - Oct 08 , 2024 | 07:01 AM