Share News

NRI: నార్త్ కరోలినాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:53 AM

అమెరికాలోని నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

NRI: నార్త్ కరోలినాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కాంకార్డ్ ప్రాంతంలో తెలుగువారు తక్కువగా ఉన్నప్పటికీ తెలుగు పండుగల సందడి ఎక్కువే ఉంటుందని స్థానికులంటున్నారు (NRI). ఈ మాటను నిజం చేస్తూ శనివారం బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుకున్నారు. స్థానికంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు.. బతుకమ్మ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ ఉత్సవాల్లో స్థానికంగా ఉండే అమెరికన్లను కూడా భాగస్వాములను చేశారు. వారికి కూడా తెలంగాణ సంస్కృతి గొప్పదనం తెలిసేలా బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వివరించారు. సంబరాల ముగింపులో బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.

3.jpgBathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు

Read Latest and NRI News

Updated Date - Oct 09 , 2024 | 11:54 AM