Share News

NRI: గ్లాస్గోలో నేడు నవరాత్రి, బతుకమ్మ వేడుకలు!

ABN , Publish Date - Oct 06 , 2024 | 09:53 AM

స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ నిర్వహించేందుకు స్థానిక తెలుగు ఎన్నారైలు సిద్ధమయ్యారు. అక్టోబర్ 6న వైభంగా దసరా, బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు గ్లాస్గో తెలుగు సాంస్కృతిక సంఘం ప్రతినిధులు తెలిపారు.

NRI: గ్లాస్గోలో నేడు నవరాత్రి, బతుకమ్మ వేడుకలు!

ఎన్నారై డెస్క్: స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో నగరంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు స్థానిక తెలుగు ఎన్నారైలు సిద్ధమయ్యారు. అక్టోబర్ 6న వైభవంగా నవరాత్రి, బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు గ్లాస్గో తెలుగు సాంస్కృతిక సంఘం ప్రతినిధులు తెలిపారు. గ్లాస్గో దక్షిణ భాగంలో హిందూ సమాజం ఉంటోందన్నారు. గతంలో అక్కడ వారికి సమీపంలో సాంస్కృతిక కేంద్రం లేకపోవడంతో మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో తొలుత నిపుణుల బృందం సమావేశమై ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక దేవాలయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.

NRI: న్యూజెర్సీ తానా ఆధ్వర్యంలో ‘భారతీయం’ సత్యవాణి ప్రవచనం

3.jpg


ఈ దిశగా మదర్ ఎర్త్ ఓ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాలకు స్థలాన్ని ఎంపిక చేసిన లక్ష్యాన్ని నెరవేర్చినట్టు వివరించారు. ఈ ఏడాది అక్కడ నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల, వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి, బతుకమ్మల వేడుకలను నిర్వహిస్తారు.అక్టోబర్ 6 న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకోనున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ వేడుక జరగబోతోందని తెలుగు సంఘం వారు హర్షం వ్యక్తం చేశారు.

2.jpgRead Latest and NRI News

Updated Date - Oct 06 , 2024 | 11:22 AM