Share News

NRI: రియాద్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ABN , Publish Date - Oct 15 , 2024 | 08:01 PM

సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు విజయదశమి, బతుకమ్మ ఉత్సవాలను భక్తి శ్రధ్ధలతో ఘనంగా జరుపుకొన్నారు.

NRI: రియాద్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు (NRI) విజయదశమి, బతుకమ్మ ఉత్సవాలను భక్తి శ్రధ్ధలతో ఘనంగా జరుపుకొన్నారు.

రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘టాసా’ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు శమీ, ఆయుధ, వాహాన పూజలు జరుపుకోవడంతో పాటు మిత్రుల ఆలింగనాలు, పెద్దల ఆశీర్వచనాలతో అందరు ఆనందంలో గడుపగా, రావణాసుర వధ నాటకంలో చిన్నారులు కేరింతలతో హోరెత్తించారు. నాగమణి, విద్య గురజాల, సింధూ పోకురిలు చేసిన అమ్మవారి అలంకరణ.. పాల్గొన్న వారందర్నీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మను తలపించింది.

NRI: రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ

2.jpg


తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక విజయ దశమి వేడుక. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల అనంతరం తెలంగాణలో దసరా పండుగగా సంబురంగా జరుపుకోవడం అనవాయితీగా ఉంది. ఇక్కడ కూడా లోకిని అశ్విని, శ్రీదేవి, వినూత్న, నీలోత్పల, మణి, జ్యోతి, దివ్య, ప్రగతిలు వివిధ పువ్వులతో కూడిన బతుకమ్మలను పేర్చారు. అదే విధంగా, కృష్ణమూర్తి, లోకిని అశ్విని దంపతుల ఆధ్వర్యంలో అభిలాష్ రెడ్డి మిట్టపల్లి, వినూత్న దంపతులు, జ్యోతిలు బతుకమ్మ ఆడుతూ పాడుతూ గౌరమ్మకు పూజలు చేసారు. దసరాకు వాహన పూజ తథ్యం. అది సౌదీ అరేబియా అయినా లేదా స్వదేశం అయినా అందుకు మినహాయింపు కాదు, అందుకే రామకృష్ణా ఆధ్యర్యంలో వాహాన పూజ చేసారు. ఇతర సంప్రదాయక పూజలను మోహన్ బాబు గురజాల, మహేంద్ర, కృష్ణమూర్తి లోకినిలు నిర్వహించారు.

NRI: దమ్మాంలో వైభవంగా దసరా వేడుకలు

3.jpg


దసరా పండుగ అనేది విందు, వినోదాల సంబురం. అందుకే వెంకటశివ భూపతిరాజు, గంగరాజు, కళ్యాణ్, బాలాజీల నేతృత్వంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను అరటి ఆకులతో అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేసిన అనంతరం అందరికీ ప్రత్యేకంగా తెప్పించిన అన్నవరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు భాస్కర్ గంధవల్లి, బిందు దంపతులు బహుమతులు ప్రధానం చేసారు.

టాసా ప్రతినిధులు తిరుపతిస్వామి స్వర్ణ అలియాస్ స్వామి, మురారి తాటికాయల, మహేంద్ర వాకాటి, శ్రీదేవి, హేమ దంపతులు కార్యక్రమాన్ని సమన్వయం చేసారు.

రియాద్ నగరంలో తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సాంస్కృతిక వికాసం కోసం తమ సంఘం ‘టాసా’ పని చేస్తోందని అధ్యక్షుడు స్వామి పేర్కొన్నారు. ఆసక్తి కల్గిన వారు 0564994408 నెంబర్‌పై సంప్రదించవచ్చని కూడా ఆయన సూచించారు.

4.jpgNRI: అబుదాబిలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు!

Read Latest and NRI News

Updated Date - Oct 15 , 2024 | 08:04 PM