Share News

NRI: రియాధ్‌లో అంగరంగ వైభవంగా దసరా సంబరాలు!

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:12 PM

రియాధ్ సభ్యులు తమకంటూ ‘సాటా సెంట్రల్’ పేరిట క్షేత్రస్థాయిలో ప్రవాసీయుల వద్దకు చెరువవుతున్న నేపథ్యంలో పండుగలలో పెద్ద పండుగ అయిన దసరాను ప్రత్యేక పరిస్థితులలో ఇటీవల రియాధ్‌లో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.

NRI: రియాధ్‌లో అంగరంగ వైభవంగా దసరా సంబరాలు!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమికి దూరంగా పరాయిగడ్డపై ఉంటూ కొందరు ప్రవాసీయులు (NRI) పండుగలు మరిచిపోవడం సాధారణం కానీ సౌదీ అరేబియాలో.. అందునా ప్రత్యేకించి రియాధ్ నగరంలో నివాసముంటున్న తెలుగు ప్రవాసీయులు మాత్రం ప్రతి పండుగను స్వదేశం కంటే మిన్నగా చేసుకుంటారు.

నైతిక విలువలు, ఆత్మగౌరవం అనే కీలకాంశాల కారణాన విబేధించిన తెలుగు ప్రవాసీ సంఘం సాటాలోని బలీయమైన రియాధ్ సభ్యులు తమకంటూ ‘సాటా సెంట్రల్’ పేరిట క్షేత్రస్థాయిలో ప్రవాసీయుల వద్దకు చెరువవుతున్న నేపథ్యంలో పండుగలలో పెద్ద పండుగ అయిన దసరాను ప్రత్యేక పరిస్థితులలో ఇటీవల రియాధ్‌లో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. రియాధ్ సీజన్‌లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత స్వరకర్త హిమేశ్ రేషమియా కార్యక్రమం ఉన్నా దాన్ని కాదని అనేక మంది తెలుగు కుటుంబాలు తమ సంస్కృతి, పండుగకు ప్రాధాన్యమిచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగకు వచ్చిన ఆడపడుచులందరికీ పసుపు కుంకుమ పెట్టి దివ్వ బైరెడ్డి, భారతీ వీర్యపల్లిలు స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని సాటా సెంట్రల్ ప్రతినిధులు వినయ్, నాగార్జునలు అన్నీ తామై నడిపించారు.

NRI: కువైట్‌లో ‘సుస్వర చరణం’

6.jpg


పండుగ ఉత్సవాల కంటే ముందు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను సభ్యులు వ్యక్తిగతంగా భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతనతో జరుపుకున్నారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో శరన్నవ రాత్రులు ఆధ్యాత్మికతో జరుపుకోవడం అనేది జీవితంలో మరిచిపోలేని ఒక అనుభూతి అని ప్రప్రథమంగా విదేశీగడ్డపై దసరా పండుగ చేసుకొన్న హైదరాబాద్ నగరానికి చెందిన నిహారిక వ్యాఖ్యానించారు.

వేద మంత్రాల ఘోషలో లక్ష్మి కాకుమని, భారతీ వీర్యపల్లిలు అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించిన తీరు భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక వాతవారణంలో నెట్టింది.

5.jpg

NRI: కాన్సుల్ జనరల్‌తో సమావేశమైన తెలుగు చర్చి ప్రతినిధి బృందం


దసరాతో పాటు బతుకమ్మ వేడుకలను కూడా తెలంగాణ సంప్రదాయరీతిలో నిర్వహించడంతో సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాయి. సుచరితలు కందుల, లావణ్య, సునీత ఆషాడపు, శ్వేతలు పువ్వులను అందమైన బతుకమ్మలుగా పేర్చగా వాటిని మరింత అలంకరణ చేసి ఆకర్షనీయంగా తీర్చిదిద్దగా వీరికి భారతీ దాసరి, సుప్రియలు సహకరించారు. బతుకమ్మ సంస్కృతి, దాంతో తెలంగాణ ఆడపడుచులకు ఉన్న అనుబంధాన్ని సుచరిత వివరించారు.

1.jpgదసరా, బతుకమ్మల నిర్వహణలో కవిత సత్తిబాబు, భారతీ దాసరి, సింధూర పబ్బతీలు సమన్వయం చేసారు. వచ్చిన అతిథులందరికీ నజీమోద్దీన్, వంశీ సుంకు, పవన్‌లు భోజనాలను వడ్డించారు.

వేడుకల నిర్వహణలో ఆనంద్ పోకూరి, ఎర్రన్న, రాంరెడ్డి, యాఖూబ్ శేఖ్, ఆమీర్ ఖాన్, సురేశ్ చింతాలు కీలకపాత్ర వహించారు.

నవంబర్ 8న దీపావళి ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు 0559631679 లేదా 0556473503 నెంబర్లపై సంప్రదించవచ్చని వారు పేర్కొన్నారు.

2.jpg3.jpgRead Latest and NRI News

Updated Date - Oct 21 , 2024 | 04:12 PM