Share News

NRI: భారతీయ పాఠశాల సమస్యలపై చర్చించిన గ్లోబల్ ఇండియన్!

ABN , Publish Date - Sep 19 , 2024 | 05:55 PM

సౌదీ అరేబియాలోని దమ్మాంలోగల భారతీయ అంతర్జాతీయ పాఠశాలలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికార వర్గాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గ్లోబల్ ఇండియన్ (జియో) అధ్యక్షుడు మల్లేశన్ తెలిపారు.

NRI: భారతీయ పాఠశాల సమస్యలపై చర్చించిన గ్లోబల్ ఇండియన్!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని దమ్మాంలోగల భారతీయ అంతర్జాతీయ పాఠశాలలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పని చేయకపోవడంతో గత కొద్ది నెలలుగా భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికార వర్గాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గ్లోబల్ ఇండియన్ (జియో) అధ్యక్షుడు మల్లేశన్ తెలిపారు (NRI).

NRI: తానా మిడ్ - అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా లేడీస్ నైట్ ఈవెంట్‌


గురువారం రియాధ్‌లోని భారతీయ రాయబార కార్యాలయంలోని దౌత్యవేత్త దినేష్ సాథియాను కలిసి దీనిపై చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో నూతన ఎయిర్ కండినషింగ్ యూనిట్లను కొనుగోలు చేసి అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పారని మల్లెశన్ వెల్లడించారు. అంతకుముందు దమ్మాంలో ఐ.యస్.యస్.డి ప్రిన్సిపాల్ సునీల్ పీటర్‌ను కూడా కలిసి ఇదే ఆంశంపై చర్చించినట్లుగా ఆయన చెప్పారు.

2.jpgNRI: యుఏఈలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం!


సౌదీ అరేబియాలోని భారతీయ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతుల అభివృద్ధిపై గ్లోబల్ ఇండియన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఈ విషయంపై ఇక నుంచి అన్ని రాష్ట్రాల వారితో కలిసి కృషి చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. విభిన్న రాష్ట్రాలకు చెందిన భారతీయులు జియోతో కలిసి వస్తున్నారని ఆయన చెప్పారు.

విద్యాభివృధ్ధి, ఆర్థిక స్వాలంబన అనేది ఏ ఒక్క ప్రాంతం, భాష లేదా మతానికి పరిమితం కాకుండా భారతీయులందరి లక్ష్యంగా జియో ఉందని మల్లేశన్ చెప్పారు. ఈ దిశగా అందరు చిత్త శుద్ధిగా ప్రయత్నిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన వికసిత్ భారత్ సిద్ధిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Read Latest and NRI News

Updated Date - Sep 19 , 2024 | 06:36 PM