NRI: హైదరాబాద్ పోలీసుల సేవలకు ఖతర్‌లో సన్మానం
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:01 PM
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రహదారి భద్రత సేవలను గల్ఫ్‌లోని కొందరు ప్రవాసీ ప్రముఖులు కొనియాడుతూ వారిని సత్కరించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృదేశం నుండి పరాయి దేశానికి వెళ్ళి వచ్చే క్రమంలో వాహనాలలో వేగం, రహదారి భద్రత అనేది అత్యంత కీలకమైన ఆంశం. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానశ్రాయం మీదుగా రాకపోకలు సాగించే ప్రవాసీయులకు సహజంగా ఒక రకమైన అభ్రదత భావం, తమకు విడ్కోలు లేదా స్వాగతం పలుకుతున్న వారి క్షేమ సమాచారాలను ఒకటికి పది సార్లు విచారించడం ప్రవాసీయుల నైజం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల రహదారి భద్రత సేవలను గల్ఫ్‌లోని కొందరు ప్రవాసీ ప్రముఖులు కొనియాడుతూ వారిని సత్కరించారు (NRI).
NRI: ఘనంగా తెలుగు కళా సమితి 40 వసంతాల వేడుకలు, దీపావళి సంబరాలు
శంషాబాద్ ట్రాఫిక్ పోలీసు అసిస్టెంట్ కమీషనర్ పెరికె నాగభూషణం, పోలీసు అధికారులు యస్.సంతోష్, వి.హన్మంత రెడ్డిలను ఖతర్‌లోని తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ (టీడబ్ల్యూఏ) అభినందించింది. ఈ మేరకు ఇటీవల దోహా నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాజా నిజామొద్దీన్, ప్రతినిధులు అబ్దుల్ రవూఫ్, మదనపల్లి సంజీవ్, చింతకుంట నర్సారెడ్డి, వేణుగోపాల్, నవీద్ తదితరులు వీరిని సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ యం. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.