NRI: సింగపూర్‌లో బహిరంగ మల విసర్జన.. భారతీయుడికి భారీ జరిమానా!
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:52 PM
సింగపూర్‌లో బహిరంగ మలవిసర్జన చేసిన ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తానిలా చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి తాజాగా రూ.25 వేల జరిమానా విధించింది.
ఎన్నారై డెస్క్: సింగపూర్‌లో బహిరంగ మలవిసర్జన చేసిన ఓ భారతీయ నిర్మాణరంగ కార్మికుడికి అక్కడి కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం మత్తులో తానిలా చేశానని నిందితుడు అంగీకరించడంతో అతడికి తాజాగా రూ.25 వేల జరిమానా విధించింది (NRI).
NRI: భారతీయ పాఠశాల సమస్యలపై చర్చించిన గ్లోబల్ ఇండియన్!
.పూర్తి వివరాల్లోకి వెళితే, రామూ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్ 30న రాత్రి వేళ బాగా మద్యం తాగి మత్తులో కూరుకుపోయాడు. ఆ రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసీనోలో గడిపిన అతడు తెల్లవారు జామున 5 గంటలకు బయటకు వచ్చాడు. అయితే, కాలకృత్యానికి వెళ్లాలనుకున్న అతడు మద్యం మత్తులో బాత్‌రూం ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు అతడు ఉదయం 7 గంటల సమయంలో ఎమ్‌బీఎస్ వద్ద ఉన్న ది షాపీస్ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మలవిసర్జన చేశాడు (NRI).
NRI: తానా మిడ్ - అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా లేడీస్ నైట్ ఈవెంట్
నిందితుడు బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. తన పని ముగించుకున్నాక అక్కడ నుంచి వెళ్లిపోయాడని, జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఆ తరువాత క్రాంజీలోని తన నివాసానికి వెళ్లాడని తెలిపారు. ఆ తరువాత సింగపూర్ నుంచి వచ్చేసిన అతడు మళ్లీ జూన్ 4 వెళ్లాడు. మరోసారి అతడు కెసీనోలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది గుర్తుపట్టారు. దీంతో, చివరకు పోలీసులకు చిక్కాడు.
అయితే, నిందితుడిపై గరిష్ఠ జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును అభ్యర్థించారు. అతడు దాదాపు 10 నిమిషాల పాటు బయటే ఉన్నాడని, ఇది సాధారణ విషయం కాదని అన్నాడు. మరోవైపు, నిందితుడు మాత్రం స్వల్ప జరిమానా విధించాలని కోరాడు (Indian Man Fined Rs 25000 For Defecating On Marina Bay Sands Floor In Singapore).
NRI: యుఏఈలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం!
దీనిపై న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. జరిమానా తక్కువగా ఉండాలంటే ఒకే ఒక పరిష్కారం ఇలాంటి పనులు చేయకపోవడమే అని మండిపడ్డారు. ఈ తప్పు పునరావృతమైతే జరిమానా మరింత ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’’ అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, నెట్టింట ఈ ఉదంతం మాత్రం జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.