Share News

Canada: కెనడాలో దారుణం.. ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

ABN , Publish Date - Oct 05 , 2024 | 07:11 AM

కెనడాలో ఉంటున్న ఓ భారతీయుడిని ఇంటి ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాల షాకైపోతున్నారు.

Canada: కెనడాలో దారుణం..  ఏ ఎన్నారైకీ ఈ కష్టం రాకూడదు!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా అద్దె ఇళ్లల్లో ఉండే వాళ్లు చెప్పిన టైంకు ఖాళీ చేసి వెళ్లిపోతారు. ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చిన సందర్భాల్లో ఒకటో రెండో రోజుల సమయం తీసుకుని ఆ తరువాత ఖాళీ చేస్తారు. అరుదుగా మాత్రమే ఇలాంటి విషయాల్లో వివాదాలు తలెత్తుతుంటాయి. కెనడాలో సరిగ్గా ఇదే ఘటన వెలుగు చూసింది. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్న భారతీయుడిని ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాలు షాకైపోతున్నారు (NRI).

Viral: ‘నాన్నా! నాకు యాక్సిడెంట్ అయ్యింది’ అంటూ ఫోన్! తండ్రికి డౌట్ రావడంతో..


బ్రాంప్టన్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో చెప్పిన దాని ప్రకారం, ఆ ఎన్నారైని ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా అతడు వినలేదట. అతడు ఖాళీ చేస్తాడంటూ కొంతకాలం పాటు ఎదురు చూసిన ఓనర్ విసిగిపోయాడట. చివరకు తానే మనుషులను పెట్టి సామాన్లన్నీ బయటకు బలవంతంగా తీసుకొచ్చేశాట. మరోవైపు, ఓనర్ అలా చేస్తుంటే ఎన్నారై బయట నిలబడి అతడితో గొడవపడటం కూడా వీడియోలో రికార్డైంది.

Viral: 130 ఏళ్ల నాటి కెమెరాతో ఫొటో తీశాడు.. ఎలా ఉందో మీరే చూడండి!

ఇక నెట్టింట వైరల్ అవుతున్న ఈ షాకింగ్ సన్నివేశం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఏమై ఉంటుందో అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అసలు వారి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు ఎవరో ఒకరిపై నెట్టడం సబబు కాదని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. పరిస్థితి చివరకు సద్దుమణిగే ఉంటుందని అనుకుంటున్నట్టు తెలిపాడు. అద్దె ఇళ్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు రాకూడదని అభిప్రాయపడ్డారు. భారత్ అయినా అమెరికా అయినా ఇంటి ఓనర్లతో వ్యవహారాలు అంత ఈజీ కాదని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏ ఎన్నారైకీ ఇలాంటి కష్టం రాకూడదని అన్నారు.


Mumbai: వామ్మో.. 1బీహెచ్‌కే ఇంటి రెంటు రూ.45 వేలా! షాక్‌లో జనాలు!

మరికొందరు మాత్రం ఈ ఉదంతంపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫ్రీగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి పని చేసి వెళ్లిపోయినట్టు ఉంది. ఇందులో ఆ ఎన్నారై ఇబ్బంది పడాల్సిందేమీ లేదు’’ అంటూ తుంటరి వ్యాఖ్యలు చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

కెనడాలో ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతుండటంతో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. విదేశీయుల రాక అధికమవడంతో పరిస్థితి దిగజారుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే, తమపై నిందలు మోపడం సబబు కాదని అక్కడుంటున్న విదేశీయులు వాపోతున్నారు. ఇళ్ల ధరలూ తమకూ భారంగా మారాయని చెబుతున్నారు.

అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం విదేశీయులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికుల్లో అధికశాతం మంది భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఇక కెనడాలో తాత్కాలిక ప్రాతిపాదికన నివసిస్తున్న వారి వాటా జనాభాలో 6.5 శాతంగా ఉందని, దీన్ని 5 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..

Read Latest and Viral News

Updated Date - Oct 05 , 2024 | 07:22 AM