Share News

NRI: యూఏఈ అమ్నెస్టీ గురించి తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవాలి: ఐపీయఫ్

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:07 PM

యూఏఈ అమ్నెస్టీ సద్వినియోగం చేసుకోని తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి తిరిగి వెళ్ళే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని దుబాయిలోని ప్రవాస భారతీయ సంఘం ఐ.పి.యఫ్ తెలుగు చాప్టర్ కోరింది.

NRI: యూఏఈ అమ్నెస్టీ గురించి తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవాలి: ఐపీయఫ్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తమ దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశాలకు తిరిగి వెళ్ళడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీ పథకాన్ని ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని తెలుగు ప్రవాసీయులు (NRI) మాతృభూమికి తిరిగి వెళ్ళే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని దుబాయిలోని ప్రవాస భారతీయ సంఘం ఐ.పి.యఫ్ తెలుగు చాప్టర్ కోరింది.

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః


ఈ మేరకు సంఘం ఆదివారం సమావేశమై ఈ పథకం కింద స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న తెలుగు ప్రవాసీయుల కష్టసుఖాలను తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకంగా అధికారుల బృందాలను దుబాయికి పంపించాలని కోరింది. భారతీయ దౌత్య కార్యాలయాలు జారీ చేసే ఎమర్జన్సీ సర్టిఫికేట్లు, గడువు ముగిసిన పాస్ పోర్టులను పునరుద్ధరించడానికి హైదరాబాద్, విజయవాడల్లోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాల ద్వారా పోలీసు విచారణలో జాప్యం జరగకుండా చూడాలని అధ్యక్షుడు కుంబాల మహేందర్ రెడ్డి కోరారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పాస్ పోర్టుల విచారణలో విదేశాలలోని భారతీయ కార్యాలయాలు, ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాల మధ్య జాప్యం జరుగుతుండడంతో ఎమర్జన్సీ సర్టిఫికేట్లు, సాధారణ పాస్ పోర్టుల జారీలో జాప్యం జరుగుతుందని దీన్ని తగ్గించాలని ఆయన కోరారు. అదే విధంగా, గతంలో ప్రభుత్వాలు సమకూర్చినట్లుగా ఉచిత విమాన టిక్కెట్లను కూడా ఇవ్వాలని ఆయన కోరారు.


దరఖాస్తుదారులకు త్వరితంగా పాస్ పోర్టు విచారణ జరిపి, అర్హులయిన పేదలకు ఉచిత విమాన టిక్కెట్లు కూడ అందజేయాలని అభ్యర్థించారు.

స్వదేశాలకు తిరిగి వెళ్తున్న వారిలో నైపుణ్యం ప్రకారం అమరావతి, ఫ్యూచర్ సిటీల నిర్మాణంలో వారికి ఉపాధి కల్పించాలని మహేందర్ రెడ్డి కోరారు.

యు.ఎ.ఇ, భారత దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిను కూడ ఈ సందర్భంగా సమావేశం అభినందించింది.

సమావేశంలో డొక్కా శ్రీని, అపర్ణ, హరి, వేణుగోపాల్, రాజు, శ్రీనివాస్, నిమ్మల కృష్ణ, మేగి తదితరులు పాల్గోన్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చె ఐ.పి.యఫ్ దుబాయిలోని క్రీయాశీలక సంఘాలలో ఒకటిగా ఉండగా దానికి మహేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.

Read Latest and NRI News

Updated Date - Sep 09 , 2024 | 04:09 PM