AP: ఐటీసర్వ్ అలయన్స్ సినర్జీ కాన్ఫరెన్స్.. ఏపీ సీఎంకు ఆహ్వానం!
ABN , Publish Date - Sep 09 , 2024 | 10:03 PM
ఐటీ సంస్థల సంఘం ఐటీ సర్వ్ అలయన్స్ వచ్చే నెల నిర్వహించనున్న వార్షిక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ సంఘం ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.
ఐటీ సంస్థల సంఘం ఐటీసర్వ్ అలయన్స్ వచ్చే నెల నిర్వహించనున్న వార్షిక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ సంఘం ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు (NRI). ఐటీసర్వ్ అలయన్స్ గవర్నింగ్ బోర్డు చైర్‌పర్సన్ వి. అమరేశ్వరరావు, బోర్డు మెంబర్ యు. వినోద్ బాబు, ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ సురేశ్ మానుకొండ సీఎంను కలిసి ఆహ్వానం అందజేశారు. మంత్రి నారా లోకేశ్‌ను కూడా కలిసిన ప్రతినిధులు సమావేశాల్లో గెస్ట్ స్పీకర్‌గా పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలను స్థాపించాలనుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రణాళికలను వివరించాలని కోరారు. ఈసారి వేడుకల్లో ఇంద్ర నూయీ కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే పెస్పీకో ఐటీసర్వ్ టీం సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందజేసింది.
NRI: తానా కాన్ఫరెన్స్- 2025 ప్రణాళిక కమిటీ నియామకం
ఇండియా, అమెరికాల్లోని 2500 చిన్న, మధ్యతరహా ఐటీ పరిశ్రమల సంఘం ఐటీసర్వ్ అలయన్స్ నిర్వహించిన గత సమావేశాల్లో ముఖ్య అతిథులుగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, హిల్లరీ క్లింటన్, సద్గురు, యూఎస్ సెనెటర్ జాన్ కెనెడీ, స్టీవ్ ఫోర్బ్స్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అలయన్స్‌లోని ఐటీ సంస్థల ఉమ్మడి ఆదాయం దాదాపు 10 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా, భారత్‌లో అనేక మంది ఆయా సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా సభ్య సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.