NRI: కువైట్‌లో ‘సుస్వర చరణం’
ABN , Publish Date - Oct 20 , 2024 | 09:38 PM
తెలుగు కళా సమితి (టీకేఎస్) కువైట్ సగర్వంగా ఎస్‌పీ చరణ్ నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ "ఎస్‌పీ సుస్వర చరణాంజలి" అంగరంగ వైభవంగా జరిగింది.
ఎన్నారై డెస్క్: తెలుగు కళా సమితి (టీకేఎస్) కువైట్ సగర్వంగా ఎస్‌పీ చరణ్ నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ "ఎస్‌పీ సుస్వర చరణాంజలి" అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా ఎస్‌పీ చరణ్ స్వరం నుంచి జాలువారిన గాన పుష్పలు కువైట్ తెలుగు వారి మనసులో గూబాళింపులు నింపాయి (NRI).
2024-25 సంవత్సరానికి గాను తెలుగు కళా సమితి (టీకేఎస్) కువైట్‌కు, ఎన్నికైన కొత్త కార్యవర్గం, మొదటి కార్యక్రమంగా పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం అపారమైన స్వర సంపదను వారసత్వంగా పొందిన ఎస్పీ చరణ్‌తో "ఎస్పీ సుస్వర చరణాంజలి" అనే మెగా మ్యూజికల్ నైట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సాహితీ చాగంటి, రమ్యా బేహెరా, అరుణ్ కౌండిన్య పాడిన పాటలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ముఖ్యంగా పవన్ సాయి సంగీత బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
NRI: ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన కరోనా!
2024-25 సం.వ. కార్యవర్గం ఎస్పీ చరణ్‌ను సత్కరించి సన్మానపత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మాట్లాడుతూ "తెలుగు పాటలు అన్నా, తెలుగు వారు అన్నా తీయ్యగా ఉండటం సహజం. అందులోను కువైట్‌లో తెలుగు వారు ఇంకొన్ని పాళ్ళు ఎక్కువ’’ అని అన్నారు. అదే విధంగా ఈ కార్యక్రమన్ని సంకల్పించి... ఎస్పీబీకి అంకితమిచ్చినందుకు, టీకేఎస్ అధ్యక్షులు కృష్ణమ రాజును వారి కార్యవర్గాన్ని కొనియాడారు.
NRI: కాన్సుల్ జనరల్‌తో సమావేశమైన తెలుగు చర్చి ప్రతినిధి బృందం
టీకేఎస్ - కువైట్ అధ్యక్షులు దోమరాజు కృష్ణమరాజు ప్రసంగిస్తూ "ఈ సాయంత్రం ఎస్పీ సుస్వర చరణాంజలి కార్యక్రమం ది గ్రేట్ ఎస్పీ చరణ్ గారు, సాహితీ చాగంటి, అరుణ్ కౌండిన్య, రమ్య బెహరాతో పాటు పవన్ సాయి మ్యూజిక్ బ్యాండ్‌తో మిమ్మల్ని అందరిని అలరించడమే కాకుండా టీకేఎస్ మణిహారంలో ఒక అద్భుతమయిన మణిగా మిగిలిపోతుందని మీ అందరికి గార్వంగా తెలియచేసుకుంటున్నాను’’ అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్‌ని ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకుల హర్ష ద్వానాల మధ్య ఆహ్లాదంగా సాగింది.
Mahatma Gandhi Memorial: అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు