NRI: ఏపీ వరద బాధితుల సహాయనిధికి భారీ విరాళం ఇచ్చిన గుత్తికొండ శ్రీనివాస్
ABN , Publish Date - Sep 03 , 2024 | 07:45 AM
కృష్ణా జిల్లాకు చెందిన ఫ్లోరిడా ప్రవాసాంధ్రుడు గుత్తికొండ శ్ర్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయనిధికి రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు.
ఎన్నారై డెస్క్: కృష్ణా జిల్లాకు చెందిన ఫ్లోరిడా ప్రవాసాంధ్రుడు (NRI) గుత్తికొండ శ్ర్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయనిధికి రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. సోమవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన్ను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయనిధికి ప్రవాసుల నుండి అందిన తొలిచెక్కు ఇదే కావడం విశేషం.
TANA: తానా మిడ్ అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ విజయవంతం
కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి, తిరుమలలో పలు సేవా కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక ఒరవడి కలిగిన కార్యక్రమాలకు భూరి విరాళాలు అందజేసే శ్రీనివాస్, ఈ దఫా “మానవసేవే మాధవసేవ” నినాదాన్ని గుర్తు చేస్తూ ప్రకృతి విపత్తులో అలమటిస్తున్న అభాగ్యులకు తోడ్పడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు అందజేయడాన్ని చంద్రబాబు కొనియాడారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ ప్రజలతో పాటు ప్రవాసులు కూడా గుత్తికొండ లాంటివారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో వరద బారిన పడిన వారికి చేయూత అందజేసేందుకు ముందుకు రావాలని కోరారు.
Read Latest NRI News and Telugu News