NRI: ప్రవాసీ బీమా పథకాన్ని సహజ మరణాలకు వర్తించాలి: ఎన్నారై బీజేపీ నాయకుల డిమాండ్
ABN , Publish Date - Sep 12 , 2024 | 04:16 PM
విదేశాలలో పని చేస్తున్న ప్రవాసీయుల కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకంలో సహజ మరణాలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రవాసీయుల ప్రతినిధుల బృందం ఒకటి కోరింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విదేశాలలో పని చేస్తున్న ప్రవాసీయుల (NRI) కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకంలో సహజ మరణాలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రవాసీయుల ప్రతినిధుల బృందం ఒకటి కోరింది.
Bahrain: తెలుగు కళా సమితిలో మార్మోగిన గణపతి బప్పా
ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ప్రమాదవశాత్తు మరణిస్తున్న ప్రవాసీయుల కోసం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నా దీని వలన ఎవరికీ పెద్దగా ప్రయోజనం లేదని బహ్రెయిన్‌లోని తెలంగాణ ప్రవాసీ ప్రముఖుడు, ప్రవాసీ బీజేపీ నాయకుడు గవ్వలపల్లి వెంకట స్వామి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వివరించింది. ఈ మేరకు అంకపూర్ రాజరెడ్డి (బహ్రెయిన్), పండరీ (సౌదీ అరేబియా)లతో పాటు గల్ఫ్ నుండి తిరిగి వెళ్ళిన వీరేంద్రకుమార్, రాజేశ్వర్‌లు ఇటీవల కేంద్ర మంత్రితో సమావేశమై ఒక మెమోరాండంను సమర్పించారు. బండి సంజయ్‌తో పాటు పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేశ్ రెడ్డిలతో కూడా సమావేశమై ఇదే ఆంశాన్ని ప్రస్తావించారు.
NRI: తానా కాన్ఫరెన్స్- 2025 ప్రణాళిక కమిటీ నియామకం
గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల సంక్షేమం కోసం విధానపరంగా ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు చేస్తున్న కృషిని అభినందిస్తూ హైదరాబాద్‌లో అన్ని గల్ఫ్ దేశాల కాన్సులేట్లను నెలకొల్పడానికి కూడా ప్రయత్నం చేయాలని కోరినట్లుగా వెంకట స్వామి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా తన హామీలను కార్యాచరణలో చూపాలని, గల్ఫ్ సంక్షేమానికి సంబంధించి తగు చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరినట్లుగా ఆయన తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రవాసీయులు గల్ఫ్ దేశాలలో పని చేస్తుండడంతో భవిష్యత్తులో నెలకొల్పే గల్ఫ్ సంక్షేమ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని జిల్లాలో నెలకొల్పాలని కూడా వెంకట స్వామి సూచించారు.
విదేశాలలో ఉంటున్న ప్రవాసీయులకు కుటుంబంతో ఆధారం ఒక రేషన్ కార్డు మాత్రమేనని, అందులోంచి వారి పేర్లను తొలగించకుండా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా ఆయన సూచించారు.
AP: ఐటీసర్వ్ అలయన్స్ సినర్జీ కాన్ఫరెన్స్.. ఏపీ సీఎంకు ఆహ్వానం!