Share News

Bahrain: తెలుగు కళా సమితిలో మార్మోగిన గణపతి బప్పా

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:41 PM

లంబోదరశ్చ వికటో విఘ్న రాజః అని వినాయకుడ్ని షోడశ నామాల్తో కొలుస్తూ బహ్రెయి‌న్‌లో తెలుగు ప్రవాసీ కుటుంబాలు భక్తితో పరవశిస్తూ వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు.

Bahrain: తెలుగు కళా సమితిలో మార్మోగిన గణపతి బప్పా

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: లంబోదరశ్చ వికటో విఘ్న రాజః అని వినాయకుడ్ని షోడశ నామాల్తో కొలుస్తూ బహ్రెయి‌న్‌లో తెలుగు ప్రవాసీ కుటుంబాలు (NRI) భక్తితో పరవశిస్తూ వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. ఆదిలీయాలోని తెలుగు కళా సమితి ప్రాంగణం గణపతి బప్పా మోరియా… మంగళ మూర్తి మోరియా కీర్తనలతో మార్మోగిపోయింది.

NRI News: గల్ఫ్‌లో గణనాథా నమోనమః

2.jpg


తెలుగు కళా సమితి సభ్యులు ఉత్సాహంతో ఆకర్షణీయంగా అలంకరించిన వినాయక చవితి మండపం, దాని పరిసరాలు ఆహ్లాదకరంగా భక్తులను ఆకట్టుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రవాసీయుల కుటుంబాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం పూజలు చేసారు. మూడు రోజుల పూజల అనంతరం బొజ్జ గణపయ్యను సోమవారం అరేబియా సముద్ర జలాలలో నిమజ్జనం చేసారు. రమణ్ రావు, లత దంపతులు, మోహన్ మురళీధర్‌లు రూపొందించిన మండపం హైందవ సంప్రదాయాన్ని ప్రతిబింబించింది. స్థానిక పురోహిత ప్రముఖులు శ్రీనివాస్ వెంపర్లా వేద మంత్రోచ్చారణతో చేసిన అర్చక సేవలతో భక్తులు పరవశించిపోయారు.

3.jpgపాకశాస్త్రంలో ప్రావీణ్యం కల్గిన మహిళగా పేరొందిన మదినపల్లెకు చెందిన హరిప్రియా చేసిన మహాలడ్డూ, ఇతర ప్రసాద ప్రత్యేక నేవైద్యాలు భక్తుల హృదయాలను ఆకట్టుకొన్నాయి. తెలుగు నాట లడ్డూ వేలం వేయని నిమజ్జనమే ఉండదు. ఇందుకు తెలుగు వారు ఉండే అరేబియా కూడా మినహాయింపు కాదు. వినాయకుడి లడ్డూను వేలం వేయగా మూడు లక్షల రూపాయాలు పలుకగా దాన్ని దొడ్డిపాటి శ్రీనివాస రావు అత్యధిక విరాళం ఇవ్వగా కోనసీమ కుర్రోళ్ళ గ్రూప్, బ్యాట్ టీం సభ్యులు జతకలిసి ఒక జట్టుగా దక్కించుకోవడం జరిగింది.

4.jpg


పూజలు, ఇతర భక్తి కార్యక్రమాల నిర్వహణలో పద్మ రఘు, లక్ష్మి శర్మ, విజయ, అంజలీ, సౌజన్య సుప్రదీప్, లలిత శ్రీనివాస్, సౌజన్య ప్రకాశ్, స్వప్న,లావణ్య, లక్ష్మి గంగాసాయి, స్వాతి తదితరులు సహకరించగా తెలుగు ప్రవాసీ ప్రముఖులు పి.వి. సుబ్రమణ్యం, జె.వి.ఆర్.మూర్తి, రఘునాథ బాబు, ఆర్.యస్.యస్. మురళీ, హరిబాబు, శివలు తమ సహాయసహకారాలందించారు.

5.jpgతెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీశ్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, కార్యదర్శి ప్రసాద్ సహాయక కార్యదర్శి లత కోశాధికారి నాగ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు చంద్రబాబు, గంగా సాయి, సంతోష్, తదితరులు వినాయక చవితి ఏర్పాట్లను సమన్వయం చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, సహకరించిన తెలుగు వారందరికీ తెలుగు కళా సమితి అధ్యక్షుడు జగదీశ్ కృతజ్ఞతలు తెలిపారు.

బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీయుల కోసం అన్ని పండుగలను సంప్రదాయక రీతిలో తెలుగు కళా సమితి నిర్వహిస్తుంది.

Read Latest and NRI News

Updated Date - Sep 10 , 2024 | 08:44 PM