Share News

NRI: టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డికి ప్రవాసాంధ్రుల సత్కారం

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:05 PM

అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు (NRI) ఘనంగా సత్కరించారు.

NRI: టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డికి ప్రవాసాంధ్రుల సత్కారం

ఎన్నారై డెస్క్: అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు (NRI) ఘనంగా సత్కరించారు. అమెరికా పర్యటనలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన గౌరు వెంకట్ రెడ్డి ఎన్నారైలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ ప్రాంతాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారని, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓర్వకల్ కీలకపాత్ర పోషించనుందని అన్నారు. ఎన్నారైలు తమ నైపుణ్యం, పెట్టుబడులతో ముందుకు వచ్చి తమవంతు పాత్ర పోషించాలని కోరారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్, తానా బోర్డు సభ్యుడు పొట్లూరి రవి నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

NRI: జీడబ్ల్యూటీసీఎస్‌ స్వర్ణోత్సవం! ఏపీ మంత్రులు, స్పీకర్‌కు సంస్థ ఆహ్వానం

1.jpgRead Latest NRI News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 09:05 PM