NRI: ప్రవాసీ ప్రజావాణిలో సౌదీ అరేబియా నుండి ఫిర్యాదు!
ABN , Publish Date - Oct 01 , 2024 | 07:10 AM
ప్రవాసీ ప్రజావాణి ప్రారంభోత్సవం రోజున సౌదీ అరేబియాలోని తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మోహమ్మద్ జబ్బార్ గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి చర్యలు చేపట్టాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విదేశాలలో ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న ప్రవాసీయులు (NRI) తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ ప్రవాసీ సంక్షేమ విధానంలో భాగంగా ప్రవాసీ ప్రజావాణిని ఇటీవల ప్రారంభించింది.
NRI: అరబ్బునాట ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆదర్శం!
ప్రారంభోత్సవం రోజున సౌదీ అరేబియాలోని తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మోహమ్మద్ జబ్బార్ గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి చర్యలు చేపట్టాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చే ప్రవాసీయుల కోసం రుణ సదుపాయంతో పాటు వృత్తి నైపుణ్య అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన అందులో కోరారు.
NRI: కష్టాల కడలి నుండి మాతృదేశానికి తెలుగు మహిళ
గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల పేరిట యువతను పంపిస్తూ మోసం చేస్తున్న దళారులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని, ఈ దిశగా యఫ్.ఐ.ఆర్‌ల నమోదు, కేసుల విచారణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా జబ్బార్ కోరారు. గల్ఫ్ దేశాలలో భారతీయులు అరెస్టయిన సందర్భాలలో వారికి 24 గంటలలోపు భారతీయ ఎంబసీ పక్షాన న్యాయ సహాయం అందించే ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.