NRI: ప్రధాని మోదీ సభలో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:50 PM
ప్రధాని నరేంద్ర మోదీ కువైత్ పర్యటనలో భాగంగా శనివారం జరిగిన సభలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా తమ పార్టీ పతాకాన్ని ప్రముఖంగా ప్రదర్శించి ఆసక్తిని రేకెత్తించారు.
కువైత్‌లో ప్రవాసాంధ్ర టీడీపీ కార్యకర్తల ఉత్సాహం
నిన్న ప్రధాని సందర్శించిన లేబర్ క్యాంపునకు అయిదేళ్ళ క్రితం టీడీపీ మంత్రి వచ్చి వెళ్లిన వైనం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ కువైత్ పర్యటనలో భాగంగా శనివారం జరిగిన సభలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా తమ పార్టీ పతాకాన్ని ప్రముఖంగా ప్రదర్శించి ఆసక్తిని రేకెత్తించారు.
ప్రధాని ప్రసంగించిన శేఖ్ సాద్ అబ్దుల్లా స్టేడియంలోని పై భాగం గ్యాలరీలో తెలుగు దేశం పార్టీ పతాకం రెపరేపలాడించారు. ఒక చేత్తో భారతీయ త్రివర్ణ పతాకాన్ని మరో వైపు తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఊపారు (NRI).
NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు
గల్ఫ్ దేశాలలో ఈ రకమైన సభలలో ఏ రకమైన జెండాల ప్రదర్శనపై, రాజకీయ నినాదాలు వగైరా చేయడంపై నిషేధం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం పసుపు జెండాను రహస్యంగా లోపలకి తీసుకెళ్ళారు.
అదే విధంగా గ్యాలరీ మొదటి వరుసలో తెలుగు దేశం పార్టీ కువైత్ శాఖ ప్రముఖుడు కోడూరి వెంకట్ ఆసీసులయ్యారు. పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు దేశం పార్టీ అభిమానులు ప్రధాని కార్యక్రంలో పాల్గొనడం జరిగింది.
NRI: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు టీడీపీ మెల్బోర్న్ నేతల విరాళం
తన కువైత్ పర్యటన సందర్భంగా మోదీ గల్ఫ్ స్పిక్ అనే సంస్థ లేబర్ క్యాంపును సందర్శించి అక్కడి కార్మికులతో ముచ్చటించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పని చేసిన కొల్లు రవీంద్ర గతంలో ఈ క్యాంపును సందర్శించి వెళ్ళారు. ఇప్పుడు సుమారు అయిదేళ్ళ తర్వాత మోదీ కూడా అదే క్యాంపును సందర్శించారు.