Jio: జియో గుడ్‌న్యూస్.. ప్రత్యేక రోమింగ్ ఆఫర్లు ప్రకటన
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:35 PM
కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు పరిచయం చేసే దేశీయ టెలికం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ (Reliance Jio) మరికొన్ని కొత్త ప్లాన్లు ప్రకటించింది. విదేశాల్లో ఉన్న తమవారికి కాల్స్ చేసుకునే కస్టమర్ల సౌకర్యార్థం సరికొత్త అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్లాన్‌లను కంపెనీ ఆవిష్కరించింది.
కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు పరిచయం చేసే దేశీయ టెలికం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ (Reliance Jio) మరికొన్ని కొత్త ప్లాన్లు ప్రకటించింది. విదేశాల్లో ఉన్న తమవారికి కాల్స్ చేసుకునే కస్టమర్ల సౌకర్యార్థం సరికొత్త అంతర్జాతీయ రోమింగ్ (ఐఆర్) ప్లాన్‌లను కంపెనీ ఆవిష్కరించింది. కొత్తగా నిర్దిష్ట దేశాల వారీగా అంతర్జాతీయ రోమింగ్ (IR) ఆఫర్లను ప్రకటించింది.
ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), థాయిలాండ్, కెనడా, సౌదీ అరేబియా, యూరప్, కరేబియన్‌లోని అనేక దేశాలలో ఉన్న భారతీయులను దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త ప్లాన్లను జియో రూపొందించింది. వివిధ ప్రయోజనాలు, నిరంతరాయంగా కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా సిద్ధం చేసిన ఈ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రాంతాలను కవర్ చేస్తూ జియో ఐఆర్ (అంతర్జాతీయ రోమింగ్) ప్లాన్లు సిద్ధమయ్యాయి. ఈ కొత్త ప్లాన్లు కరేబియన్‌లోని 24 దేశాలు, ఐరోపాలోని 32 దేశాలను కవర్ చేస్తున్నాయి. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు అపరిమిత ఇన్‌కమింగ్ మెసేజులకు అవకాశం ఉంటుంది. ఇక ఔట్ గోయింగ్ కాల్స్ విషయానికి వస్తే.. కస్టమర్లు తాము నివసిస్తున్న దేశంతో పాటు భారత్‌కు కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఇన్‌కమింగ్ కాల్స్‌ను ఏ దేశం నుంచైనా స్వీకరించవచ్చు. ఈ కాల్స్‌కు వై-ఫై కాలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అయితే వైఫై సపోర్ట్‌తో అవుట్‌గోయింగ్ లోకల్, ఇంటర్నేషనల్ కాల్స్, మెసేజులు చేసుకునే అవకాశం లేదు.
దేశాల వారీగా ఆఫర్లు ఇవే..
యూఏఈకి 3 ప్లాన్స్
రూ.898 ఆఫర్: ఈ ప్లాన్‌లో 100 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. లోకల్, ఇండియాలోనివారికి కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు 100 నిమిషాల ఇన్‌కమింగ్ కాల్స్, 1జీబీ డేటా, 7 రోజుల వ్యాలిడిటీతో 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
రూ.1,598 ఆఫర్: ఈ ప్లాన్‌లో 150 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్‌లు, 3జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 14 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది.
రూ.2,998 ఆఫర్: ఈ ప్లాన్‌లో 250 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్, 7జీబీ డేటా లభించనుండగా వ్యాలిడిటీ 21 రోజులుగా ఉంది.
సౌదీ అరేబియాకు 2 ప్లాన్లు
రూ.891 ఆఫర్: ఈ ప్లాన్‌లో 100 నిమిషాల కాల్స్, 1జీబీ డేటా, 20 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది.
రూ.2,891 ఆఫర్: ఈ ప్లాన్‌లో 150 నిమిషాల కాల్స్, 5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
కెనడాకు 2 ప్లాన్లు
రూ.1,691 ఆఫర్: ఈ ఆఫర్‌లో 100 నిమిషాల కాల్స్, 5జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది.
రూ.2,881 ఆఫర్: ఈ ఆఫర్‌లో 150 నిమిషాల కాల్స్, 10జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభించనుండగా 30 రోజులు చెల్లుబాటు అవుతుంది.
థాయిలాండ్‌కు 2 ప్లాన్‌లు..
రూ.1,551 ఆఫర్: 100 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్‌లు, 6జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్‌లు లభించనుండగా వ్యాలిడిటీ14 రోజులుగా ఉంది.
రూ.2,851 ఆఫర్: 150 నిమిషాల కాల్స్, 12జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లకు లభిస్తాయి. వ్యాలిడిటీ 30 రోజులు.
యూరప్, కరేబియన్ ప్లాన్స్ ఇవే..
యూరప్‌లో ఉంటున్నవారికి జియో రూ.2,899 ధరతో రోమింగ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 32 దేశాలను కవర్ చేస్తుండగా వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. 100 నిమిషాల అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్, 5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.
ఇక కరేబియన్ ప్యాక్‌లు రూ.1,671తో ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ 24 దేశాలను కవర్ చేస్తుంది. 150 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్‌లు, 50 నిమిషాల ఇన్‌కమింగ్ కాల్‌లు, 1జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. ఇక ప్రీమియం కరీబియన్ ప్యాక్ ధర రూ.3,851గా ఉంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు 200 నిమిషాల కాల్స్, 4జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.